ప్రతి ఏడాది అక్షయ తృతీయ వేళ బంగారం ధరల ట్రెండ్ ఎలా ఉంటుందో తెలుసా?

Akshaya Tritiya Gold Price: అప్పట్లో రూ.59,845గా ఉన్న బంగారం ధర, ఇప్పుడు రూ.71,100కి పెరిగింది. అయినప్పటికీ..

అక్షయ తృతీయ వేళ దేశంలోని చాలా మంది ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేయడానికి అమితాసక్తి కనబర్చుతారు. గత ఏడాది అక్షయ తృతీయ (2023 ఏప్రిల్ 22) నాటి కంటే ఈ ఏడాది బంగారం భారీగా పెరిగింది. అప్పటితో పోల్చుకుంటే దేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.11,300 పెరిగింది.

అప్పట్లో రూ.59,845గా ఉన్న బంగారం ధర, ఇప్పుడు రూ.71,100కి పెరిగింది. అయినప్పటికీ 10 గ్రాముల బంగారం ధర ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి కంటే సుమారు 4 శాతం తక్కువగా ఉంది. దీంతో పసిడి ప్రియులు అక్షయ తృతీయ సందర్భంగా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చని నిపుణులు అంటున్నారు.

అక్షత తృతీయ సందర్భంగా.. 2014 నుంచి ఇప్పటివరకు కొనసాగిన బంగారం ధరల ట్రెండ్‌లను పరిశీలిస్తే అక్షయ తృతీయ వేళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గడం చూడవచ్చు. 2015లో అక్షయ తృతీయ వేళ ధర 12 శాతం తగ్గింది. 2017లో 3.23 శాతం తగ్గుదల కనపడింది. 2020లో మాత్రం అత్యధికంగా 32 శాతం రిటర్న్స్ తో పెరుగుదల కనపడింది. 2023లో మళ్లీ రిటర్న్స్ రెండంకెలకు చేరుకున్నాయి.

కాగా, 2019లో 10 గ్రాముల బంగారం ధర 35,220గా ఉండగా, ఆ తర్వాత సంవత్సరాల్లో 2020లో 55,500… 2021లో 48,720… 2022లో 52,670… 2023లో 62,435గా ఉంది. ప్రతి ఆర్థిక సంవత్సరం అక్షయ తృతీయతో ప్రారంభమయ్యే తొలి త్రైమాసికం బంగారం వెండికి మంచి డిమాండ్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read: అక్షయ తృతీయ రోజు మహిళలకు బిగ్‌షాక్‌ ఇచ్చిన బంగారం ధర.. రూ.90వేలకు చేరిన ..

ట్రెండింగ్ వార్తలు