Apple MacBook Neo : వావ్.. కిర్రాక్ ఆఫర్.. క్రోమాలో ఆపిల్ మ్యాక్‌బుక్ నియో జస్ట్ రూ. 38,440కే.. ఫుల్ డిటెయిల్స్
Apple MacBook Neo : ఆపిల్ కొత్త మ్యాక్ బుక్ కొనేవారికి భారీ ఆఫర్. క్రోమా ‘ఎవ్రీథింగ్ ఆపిల్’ సేల్ మళ్లీ ప్రారంభమైంది. ఆపిల్ మ్యాక్ బుక్ నియో రూ. 38,440కే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ మీకోసమే..
Apple MacBook Neo
- క్రోమా ఎవ్రీథింగ్ ఆపిల్ సేల్ ఆఫర్లు
- ఆపిల్ మ్యాక్‌బుక్ నియో అతి చౌకైన ధరకే
- క్రోమా నుంచి రూ. 38,440కే ఇంటికి తెచ్చుకోవచ్చు
Apple MacBook Neo : ఆపిల్ కొత్త మ్యాక్‌బుక్ కోసం చూస్తున్నారా? ఆపిల్ ప్రొడక్టులను కొనేవారికి అద్భుతమైన ఆఫర్లు. క్రోమా ‘ఎవ్రీథింగ్ ఆపిల్’ సేల్ లాస్ట్ సీజన్ మొదలైంది. ఇందులో ఐఫోన్, ఐప్యాడ్, ఎయిర్‌పాడ్స్, ఆపిల్ వాచ్, మ్యాక్‌బుక్ వంటి డివైజ్‌లు సహా అనేక రకాల ఆపిల్ ప్రొడక్టులపై భారీ తగ్గింపులను అందిస్తోంది.
మీరు ఈ సేల్ బెనిఫిట్స్ పొందాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. ఈ ఆఫర్లలో అర్హులైన వారికి మ్యాక్‌బుక్ నియో (13-అంగుళాల) కేవలం రూ. 38,440 ధరకే లభిస్తుంది. అలాగే, ఆఫర్ బెనిఫిట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్, టాటా న్యూ కాయిన్స్ ద్వారా స్టూడెంట్స్, టీచర్లకు అందజేస్తామని క్రోమా పేర్కొంది.
Read Also : ITR Filing : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. ITRలో ఈ 5 పొరపాట్లు చేస్తే ఇంటికే ఐటీ నోటీసులు!
మ్యాక్‌బుక్ నియో డీల్ వివరాలివే :
క్రోమా డేటా ప్రకారం.. మ్యాక్‌బుక్ నియో (13-అంగుళాల) ఎంఆర్పీ ధర రూ. 69,900గా ఉంది. అయితే, ప్రస్తుతం ఆఫర్ల కింద విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం డిస్కౌంట్లతో ధర సుమారుగా రూ. 38,440కి తగ్గింది.
- విద్యార్థులు, ఉపాధ్యాయులకు స్పెషల్ ధర : రూ. 62,211
- పాత ఫోన్ రూ. 12,500 వరకు ఎక్స్చేంజ్ బెనిఫిట్
- పాత ఫోన్ ఎక్స్చేంజ్ వాల్యూ : రూ. 12,500 వరకు (వర్కింగ్ కండిషన్ బట్టి)
- రూ. 7వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్
- రూ. 4,271 వరకు టాటా న్యూ కాయిన్స్
- ఈ బెనిఫిట్స్ అన్నీ కలిపితే మ్యాక్‌బుక్ నియో ధర రూ. 38,440కి తగ్గుతుంది.
ఈ డీల్స్ ఎలా పొందాలంటే? :
- క్రోమా స్టోర్ లేదా రిటైలర్ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ను విజిట్ చేయండి.
- స్టూడెంట్ లేదా టీచర్‌గా మీ అర్హతను వెరిఫై చేసుకోండి.
- మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి తగ్గ వాల్యూ పొందండి.
- ఆఫర్ కింద అదనపు ఎక్స్చేంజ్ బోనస్ సద్వినియోగం చేసుకోండి.
- అర్హత గల పేమెంట్ మెథడ్ ద్వారా కొనేసుకోండి.
- టాటా న్యూ కాయిన్స్‌ను పొందండి.
ఇతర ఆపిల్ ప్రొడక్టులపై ఆఫర్లు :
ఈ సేల్‌లో ఇతర ఆపిల్ డివైజ్‌లపై కూడా భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ఐప్యాడ్ 11వ జెన్ (A16) ధర రూ.29,489కి, ఐప్యాడ్ ఎయిర్ M4 ధర రూ. 55,490 ప్రారంభ ధరకు కొనుగోలు చేయొచ్చని క్రోమా తెలిపింది.
ప్రమోషనల్ పీరియడ్ సమయంలో ఎయిర్‌పాడ్స్ ప్రో 3 రూ. 22,491 నుంచి ఉండగా ఎయిర్‌పాడ్స్ 4 డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ “ఎవ్రీథింగ్ ఆపిల్ సీజన్ ఫినాలే” సేల్ ఎంపిక చేసిన క్రోమా ఛానెళ్లలో లిమిటెడ్ టైమ్ వరకు మాత్రమే ఉంటుంది.
