పన్నా మైన్స్ లో నిరుపేదకు దొరికిన రూ.40లక్షల విలువైన వజ్రం

  • Publish Date - October 30, 2020 / 11:59 AM IST

MP pann mines : వర్షాకాలం..నిరుపేదలకు వరాల కాలం. అదే వజ్రాల వేటల కాలం. ఒక్క వజ్రం దొరికితే చాలు దరిద్రం తీరిపోతుందనే ఆశతో వజ్రాల కోసం గాలిస్తుంటారు ఎంతోమందిఆశావహులు. ముఖ్యంగా పేద..మధ్యతరగతి ప్రజలు వజ్రాల కోసం వెదుకుతుంటారు.


వర్షాకాలం వచ్చిదంటే చాలు ఏపీలోని రాయలసీమ, మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో వెనుకబడ్డ ప్రాంతమైనపన్నా జిల్లాల్లో వజ్రాలు పేదవారికి ఆశల మెరుపులు మెరిపిస్తాయి. భారత్ లో వజ్రాలకు పన్నా ప్రసిద్ధి అనే విషయం తెలిసిందే. వర్షాకాలం వచ్చిదంటే చాలు పన్నాలో వజ్రాల వేట మొదలవుతుంది. అది వర్షాకాలం అంతూ కొనసాగుతుంటుంది.



https://10tv.in/viral-video-youtuber-burns-down-his-mercedes-out-of-frustration/
ఈ క్రమంలో ఓ నిరుపేద కార్మికుడిని ఓ వజ్రం అదృష్టం రూపంలో వరించింది. మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్రాల గనుల్లో పనిచేసే బల్బీర్‌సింగ్‌ యాదవ్‌కు గురువారం (అక్టోబర్ 28,2020) ఏకంగా 7.2 క్యారెట్ల వజ్రం లభించింది. ఆ వజ్రాన్ని చూడగానే సంతోషంగా ఎగిరి గంతేశాడు. ఇక నా దరిద్రం తీరిపోయినట్లే నంటూ తెగ సంబరపడిపోయాడు. వజ్రం దొరికిన వెంటనే అనంతరం అధికారుల వద్దకు వెళ్లి విషయాన్ని తెలియజేశాడు.


దీనిపై డైమండ్‌ ఇన్‌స్పెక్టర్‌ అనుపమ్‌సింగ్‌ మాట్లాడుతూ ఈ 7.2 క్యారెట్ల వజ్రం పతి బజారియా ప్రాంతంలోని కృష్ణ కల్యాణ్‌పూర్‌ గనుల్లో లభించిందని తెలిపారు. ఈ వజ్రం విలువ ఎంత ఉంటుందనే విషయాన్ని నిపుణులు వెల్లడిస్తారని తెలిపారు.


విలువైన వజ్రం దొరకటంతో బల్బీర్‌సింగ్‌..అతని భార్య లాడ్‌వతి సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ వజ్రం రూ.35-40 లక్షల వరకు ఉంటుందని..ఇక తమ కష్టాలు తీరిపోయినట్లేనని తెగ మురిసిపోతున్నారు. ఈ వజ్రాన్ని వేలం వేసి, 12.5 శాతం మినహాయించి మిగతాది బల్బీర్‌సింగ్‌ కుటుంబానికి అందజేస్తామని అధికారులు తెలిపారు.

కాగా వజ్రాల వేటలో భాగంగా పన్నా జిల్లాలోనే ఇటీవల ఓ కూలీకి రూ.50లక్షల విలువైన వజ్రం లభించింది. రాణిపురా గనిలో వజ్రాల కోసం తవ్విన ఆనందిలాల్ కుష్వాహకు 10.69 కేరట్ల వజ్రం లభించింది. రాణిపూర్ ప్రాంతంలోని భూమికి అనందిలాల్ కుష్వాహకు పట్టా ఇచ్చారు. అంతకు ముందు కూడా కుష్వాహకు ఒక వజ్రం దొరికింది.

ట్రెండింగ్ వార్తలు