NHRC Notice to Bihar Govt: కల్తీ మద్యం మరణాలపై మానవ హక్కుల సంఘం కన్నెర్ర.. బిహార్ ప్రభుత్వానికి నోటీసులు

బిహార్‭లోని సారణ్ జిల్లాలో కల్తీ మద్యం తాగి ఇప్పటి వరకు 71 మంది మరణించినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన లెక్కల ప్రకారం 21 మంది మరణించారు. చాలా మంది చికిత్స పొందుతున్నారు. మరి కొందరు తమ కంటి చూపును కోల్పోయారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై బిహార్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది

NHRC Notice to Bihar Govt: బిహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి పదుల సంఖ్యలో మరణాలు సంభవించడంపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‭హెచ్ఆర్‭సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తి చేసింది. ఈ విషయమై వివరణ ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ సహా ఆసుపత్రుల్లో చేరిన బాధితుల చికిత్సకు సంబంధించిన వివరాలు, వారికిచ్చే నష్టపరిహారం వంటి పలు అంశాలతో వివరాణాత్మక నివేదిక తమకు నాలుగు వారాల్లోగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతే కాకుండా ఈ ఘటనకు కారణమైన అధికారులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో వెల్లడించాలని ఎన్‭హెచ్ఆర్‭సీ జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు.

Gurugram: మూత్ర విసర్జనకని బెంజ్ కారును రోడ్డు పక్కన ఆపిన లాయర్.. కత్తితో బెదిరించి కారెత్తుకెళ్లిన దుండగులు

బిహార్‭లోని సారణ్ జిల్లాలో కల్తీ మద్యం తాగి ఇప్పటి వరకు 71 మంది మరణించినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన లెక్కల ప్రకారం 21 మంది మరణించారు. చాలా మంది చికిత్స పొందుతున్నారు. మరి కొందరు తమ కంటి చూపును కోల్పోయారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై బిహార్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది. అడిషనల్ ఎస్పీ నేతృత్వంలో ముగ్గురు డిప్యూటీ పోలీస్ సూపరిండెంట్లు సహా 31 మందితో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సారణ్ జిల్లా మెజిస్ట్రేట్ తెలిపింది.

Ukraine War: మా గెలుపుతో లేదా ప్రపంచ వినాశనంతో యుద్ధం ముగుస్తుంది: పుతిన్ సలహాదారుడు  

ఇక ఈ వివాదం బిహార్ రాజకీయాల్లో తీవ్ర వివాదంగా మారింది. అధికార, విపక్షాల మద్య పెద్ద యుద్ధమే కొనసాగుతోంది. వాస్తవానికి బిహార్ రాష్ట్రంలో 2016 నుంచి మద్య నిషేధం అధికారికంగా అమలులో ఉంది. కానీ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. సాధారణ ప్రజలు, ప్రభుత్వంలో ఉన్నవారు.. తరుచూ ఏదో సందర్భంలో మద్యం సేవించో, రవాణా చేస్తూనో కనిపిస్తూనే ఉన్నారు. దీంతో మద్య నిషేధంలో ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు నితీష్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అయితే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజల్లో కూడా మార్పు రావాలని ప్రభుత్వం చెబుతోంది.

ట్రెండింగ్ వార్తలు