Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్త దుమారం.. అయినా తగ్గేదేలే అంటున్న ఉదయనిధి స్టాలిన్

విపక్షాల ఇండియా కూటమిలో డీఎంకే భాగస్వామి. ఆ కూటమిలో ఉన్న ప్రధాన పార్టీల్లో డీఎంకే ఒకటి. ఇప్పటికే ఉదయనిధి వ్యాఖ్యలపై ఎన్డీయే పక్షాలు ఒంటికాలిపై విరుచుకుపడుతున్నాయి

Sanatana Dharma Remarks: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్త దుమారం లేసింది. ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షానే దీనిపై స్పందిస్తూ ఇండియా కూటమే సనాతన ధర్మానికి వ్యతిరేకమని విమర్శలు గుప్పించారు. ఇక రైట్ వింగ్ పార్టీలు, సంఘాల నుంచైతే పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. అయినప్పటికీ తాను మాత్రం అస్సలు తగ్గేది లేదని అంటున్నారు ఉదయనిధి స్టాలిన్. ఇవేవీ తాను ఇప్పుడు చెప్తున్నవి కాదని అంబేద్కర్, పెరియార్ వంటివారు ఎప్పుడో చెప్పిన విషయాల్ని గుర్తు చేస్తున్నానని సమర్ధించుకుంటున్నారు.

Bengaluru : పాకిస్తాన్ వెళ్లిపోమంటూ ముస్లిం విద్యార్ధులను ధూషించిన టీచర్.. విద్యాశాఖకు ఫిర్యాదు చేసిన పేరెంట్స్

తనపై కేసులు పెడితే పెట్టుకోండని, ఇంకేదైనా చేస్తే చేసుకోండని తెగేసి చెప్తున్నారు. ఎంత చేసినా తన వ్యాఖ్యలపై కట్టుబడి ఉంటానని ఛాలెంజ్ విసురుతున్నారు ఉదయనిధి. శనివారం ప్రోగ్రెసివ్ రైటర్స్, ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ ‘‘కొన్నింటిని కేవలం వ్యతిరేకించకూడదు, పూర్తిగా నిర్మూలించాలి. మనం డెంగ్యూను, దోమలను, మలేరియాను, కరోనా లాంటి వాటిని వ్యతిరేకించలేం. వాటిని నిర్మూలించాలి. అలాగే సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలి’’ అని అన్నారు.

Pawan Kalyan Birthday : న్యూయార్క్ టైంస్క్వేర్ వద్ద పవన్ కళ్యాణ్ బర్త్ డే.. ఈ స్పెషల్ వీడియో చూశారా?

అంతే, దీనిపై పెద్ద దుమారమే లేసింది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ దీనిపై స్పందిస్తూ ‘‘సనాతన ధర్మాన్ని తమిళనాడు మంత్రి ఉదయనిధి మలేరియా, డెంగ్యూలతో పోల్చుతున్నారు. దీనిని వ్యతిరేకించడం కాకుండా సమూలంగా నిర్మూలించాలని అభిప్రాయపడుతున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే సనాతన ధర్మాన్ని పాటించేవారు జనాభాలో 80 శాతం మంది ఉన్నారు, వారిని సామూహికంగా హత్య చేయాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలో డీఎంకే ముఖ్యమైన సభ్యులు, కాంగ్రెస్‌తో ఆ పార్టీకి సుదీర్ఘకాలం నుంచి మైత్రి ఉంది. ముంబైలో జరిగిన ఇండియా కూటమి సమావేశాల్లో దీనిపైనే అంగీకారం కుదిరిందా?’’ అని ప్రశ్నించారు.

MLA Sanjay : రాష్ట్రంలో 4 వేల కోట్ల ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులను కేసీఆర్ ప్రభుత్వం చెల్లించింది : ఎమ్మెల్యే సంజయ్

అయితే మాల్వియా ట్వీట్ ను ఉదయనిధి కోట్ ట్వీట్ చేస్తూ ‘‘నేను సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న వారిని నరమేధం చేయాలని చెప్పలేదు. సనాతన ధర్మం అనేది కులం, మతం పేరుతో ప్రజలను విభజించే సూత్రం. సనాతన ధర్మాన్ని నిర్మూలించడం మానవత్వాన్ని, మానవ సమానత్వాన్ని నిలబెట్టాలి. నేను మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటాను. నేను సనాతన ధర్మం కారణంగా అణగారిన, అట్టడుగున ఉన్న వారి తరపున మాట్లాడాను. సమాజంపై సనాతన ధర్మం ప్రతికూల ప్రభావం గురించి లోతైన పరిశోధన చేసిన పెరియార్, అంబేద్కర్ ో విస్తృతమైన రచనలను ఏ వేదికలోనైనా ప్రదర్శించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ప్రసంగంలోని కీలకమైన అంశాన్ని పునరుద్ఘాటిస్తున్నాను: దోమల ద్వారా కోవిడ్-19, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందినట్టే.. అనేక సామాజిక దురాచారాలకు సనాతన ధర్మం కారణమని నేను నమ్ముతున్నాను. న్యాయస్థానం లేదా ప్రజాకోర్టులో ఏవైనా సవాళ్లను ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం ఆపండి’’ తనదైన శైలిలో గట్టిగానే సమాధానం ఇచ్చారు.

Rahul Gandhi: ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని స్పష్టం చేసిన రాహుల్

విపక్షాల ఇండియా కూటమిలో డీఎంకే భాగస్వామి. ఆ కూటమిలో ఉన్న ప్రధాన పార్టీల్లో డీఎంకే ఒకటి. ఇప్పటికే ఉదయనిధి వ్యాఖ్యలపై ఎన్డీయే పక్షాలు ఒంటికాలిపై విరుచుకుపడుతున్నాయి. అయితే ఇండియా కూటమిలోని పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దీనిపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది. అసలు ఆ పార్టీలు స్పందింస్తాయా లేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. మొత్తానికి హిందీ వ్యతిరేకత, బ్రాహ్మణ వ్యతిరేకత అనేవి తమిళనాడులో తరుచూ కనిపించేవే. డీఎంకే పార్టీ నేతలు గతంలో ఇలాంటి వ్యాఖ్యలు అనేకం చేశారు.

ట్రెండింగ్ వార్తలు