Dogs Bit School Girl : తమిళనాడు హోసూర్‌లో దారుణం.. స్కూల్ విద్యార్థినిపై దాడి చేసి, కరిచి ఈడ్చుకెళ్లిన వీధి కుక్కలు

వీధిలో వెళ్తున్న చిన్నారిని మూడు కుక్కలు చుట్టుముట్టి దాడి చేసి, కరిచి ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి కుక్కలను తరిమికొట్టి, ఆ బాలికను రక్షించాడు.

Dogs Bit School Girl : తమిళనాడులో దారుణ జరిగింది. హోసూర్‌లో పాఠశాల విద్యార్థినిపై వీధి కుక్కలు దాడి చేసి కరిచి ఈడ్చుకెళ్లాయి. ఆదివారం హోసూరులో ఓ పాఠశాల విద్యార్థినిపై వీధి కుక్కలు దాడి చేశాయి. కొద్దిసేపటి తర్వాత బాలికను బాటసారులు రక్షించి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది.

సీసీఫుటేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వీధిలో వెళ్తున్న చిన్నారిని మూడు కుక్కలు చుట్టుముట్టి దాడి చేసి, కరిచి ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి కుక్కలను తరిమికొట్టి, ఆ బాలికను రక్షించాడు.

Srikakulam : శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి

వెంటనే బాలికను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చిన్నారిపై కుక్కలు దాడి చేసిన దృశ్యాలతో ఉన్నసీసీఫుటేజీని చూసిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో పెరుగుతున్న వీధికుక్కల సమస్యను పరిష్కరించాలని స్థానిక అధికారులను కోరుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు