అస్మిత పథకం : యాప్ లో రూ.5కే శానిటరీ ప్యాడ్స్

  • Publish Date - February 23, 2020 / 07:01 AM IST

రుతుక్రమం విషయంలో గ్రామీణ మహిళలు సరైన జాగ్రత్తలు పాటించడం లేదని తెలుసుకున్న మహారాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ వారి కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని భావించింది. అందులో భాగంగా ‘అస్మిత’ పేరిట కొత్త పథకం అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం ఐదు రూపాయలు చెల్లిస్తే..చాలు..8 శానిటరీ ప్యాడ్స్ అందించనున్నారు.

గ్రామీణ మహిళలు శానిటరీ ప్యాడ్స్ వాడడం లేదని సర్వేలో తేలిందని,. అందువల్ల ఈ పథకం అమలు చేస్తున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజా ముండే వెల్లడించారు. 8 శానిటరీ ప్యాడ్స్ ఉన్న ప్రతి ప్యాకెట్ కు ప్రభుత్వం సబ్సిడీగా రూ. 15.29 ఇస్తుందన్నారు. మార్చి 08వ తేదీ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా..సినీ నటుడు అక్షయ్ కుమార్ చేతులు మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. శానిటరీ ప్యాడ్స్ నేపథ్యంలో అక్షయ్ కుమార్ ‘ప్యాడ్ మ్యాన్’ చిత్రంలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంచలనం రేకేత్తించింది. అందరిలోనూ ఆలోచింప చేసింది. 

అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామీణ మహిళలు ఏడాదికి రూ. 182.40 పైసలు చెల్లిస్తే..ఏడాది పొడవున వారికి అవసరమయ్యే శానిటరీ ప్యాడ్స్ అందిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. బాలికలతో పాటు మహిళల మెరుగైన ఆరోగ్యం కోసం సబ్సిడీ ధరలకు శానిటరీ ప్యాడ్స్ అందించేలా కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజా ముండే వెల్లడించారు. 

బీడ్ జిల్లాలోని రైమోహ గ్రామంలో సుల్తానా శానిటరీ ప్యాడ్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేవలం రూ. 5 చొప్పున..మూడు రోజుల్లో 100 ప్యాకెట్లు అమ్ముడవుతాయని సుల్తానా తెలిపారు. ఒక ప్యాకెట్ కు రూ. 1 లాభం పొందనుంది. రెండు సంవత్సరాల క్రితం షేక్ పది మంది మహిళలతో కలిసి జరీన్ మహిళా స్వయం సహత్య అనే స్వయం సహాయక సంఘంలో చేరారు. కంప్యూటర్లు, మొబైల్ టెక్నాలజీ పరిజ్ఞానం సంపాదించుకుంది. బ్యాంకు ఖాతాను ఎలా లింక్ చేయాలో..కొనుగోలు ఆర్డర్లు ఎలా చేయాలో ఈమె నేర్చుకుంది. 

మార్చి 2018 నుంచి 2.75 లక్షల జిల్లా పరిషత్ పాఠశాల బాలికలు మహారాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద పథకం కోసం నమోదు చేసుకున్నారు. వీరికి ఒక గుర్తింపు జారీ కార్డు ఇవ్వబడుతుంది. సంవత్సరంలో 13 ప్యాకెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. ప్యాకెట్ కొన్న ప్రతిసారి..గుర్తింపు ఫోన్ నెంబర్ లో మెసేజ్ వస్తుంది. స్వయం సహాయక సంఘాలు ప్యాకెట్లను ఆన్ లైన్ లో కొనుగోలు చేసి గ్రామస్థాయిలో అమ్ముకొనే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 57 వేల 081 మంది పాఠశాల బాలికలు ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారని అంచనా. 

మునుపటి ప్యాడ్ ల కంటే..ప్రస్తుత ప్యాడ్ లు నాణ్యమైనవని గ్రామస్తులను ఒప్పించడానికి తమకు చాలా సమయం పట్టిందని బీడ్ జిల్లా పథకానికి ఇన్ ఛార్జీగా ఉన్న షకీల్ షేక్ తెలిపారు. స్వయం సహాయక సంఘాలు ప్యాకెట్లను సేకరించడానికి..జిల్లా కార్యాలయాన్ని సందర్శించే బదులు…యాప్ లో ఆర్డర్లు ఇవ్వవచ్చన్నారు. డెలివరీ కోసం ఇండియా పోస్టుతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 

Read More : పర్సనల్ టూర్ : పాకిస్తాన్ శతృఘ్న సిన్హా

ట్రెండింగ్ వార్తలు