India : భారత్‌ రోడ్లపై టెస్లా కార్ల రయ్‌.. రయ్‌

భార‌తీయ రోడ్లపై టెస్లా ఎల‌క్ట్రిక్ కార్లు ప‌రుగులు తీయ‌నున్నాయా.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. టెస్లా ఎల‌క్ట్రిక్ కార్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Tesla Cars : భారత ఆటో మొబైల్ రంగంలోకి ప్రముఖ కంపెనీ అడుగుపెట్టబోతోంది. భార‌తీయ రోడ్లపై టెస్లా ఎల‌క్ట్రిక్ కార్లు ప‌రుగులు తీయ‌నున్నాయా.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. దేశీయ మార్కెట్‌లోకి అడుగు పెట్టేందుకు టెస్లా ఎల‌క్ట్రిక్ కార్లకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దేశీయంగా త‌యారు చేసి విక్రయించ‌డానికి.. నేరుగా దిగుమ‌తి చేసుకుని విక్రయించ‌డానికి కేంద్రం అనుమతిచ్చింది. ఇందుకోసం స‌ర్టిఫికెట్ జారీ చేసిన‌ట్లు స‌మాచారం. టెస్లా సంస్థకు చెందిన నాలుగు మోడళ్లు భారత్‌లో నడిపేందుకు అనువైనవిగా ధ్రువీకరించింది కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ.

Read More : Kabul Attack : లాలించిన మహిళా సైనికురాలు ఇక లేరు

కర్బన ఉద్గారాలు, భద్రత, ఇక్కడి రోడ్లపై తిరగగలిగే సామర్థ్యం వంటి అంశాల్లో టెస్లాకు చెందిన నాలుగు మోడళ్లు అనువైనవని కేంద్రం తెలిపింది. అయితే అవి ఏ మోడళ్లు అని కచ్చితంగా వెల్లడించనప్పటికీ.. మోడల్‌ 3, మోడల్‌ Yకి చెందిన వేరియంట్లయి ఉంటాయని తెలుస్తోంది. జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌ కలిగిన భారత్‌లోకి ప్రవేశించేందుకు టెస్లా గత కొంత కాలంగా కసరత్తు చేస్తోంది. అయితే, సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌ ఓ షరతు విధించారు.

Read More : KBC 13 : బిగ్‌బి కౌన్‌‌బనేగా కరోడ్‌పతికి వచ్చాడు.. చిక్కుల్లో పడ్డాడు!

తొలుత విదేశాల్లో తయారైన తమ కార్లను భారత్‌లో విక్రయిస్తామన్నారు. తర్వాతే స్థానికంగా తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని తేల్చి చెప్పారు. అంతకంటే ముందు కార్ల దిగుమతిపై ఉన్న సుంకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కొన్ని నెలల క్రితం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై ఇటీవల స్పందించిన కేంద్ర సర్కార్‌.. ఎలాన్‌ మస్క్‌ కోరినట్లుగా దిగుమతి సుంకాలు తగ్గిస్తే భారత్‌లో తమ కార్యాచరణ ఏంటో వివరించాలని కోరింది.

Read More : Taliban : “గే” ల వెంటబడుతున్న తాలిబన్లు..స్వలింగ సంపర్కుడిపై గ్యాంగ్ రేప్

ఈ పరిణామాలతో తాజాగా టెస్లా మోడళ్లు భారత్‌లో నడపడానికి అనువైనవిగా కేంద్రం సర్టిఫికెట్‌ ఇచ్చింది. ఇక టెస్లా భారత్‌లో మూడు ఆటో మొబైల్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. వాహనాలకు సంబంధించిన విడి భాగాల తయారీ చేయనున్నాయి ఇక్కడి కంపెనీలు. టెస్లాతో ఒప్పందం చేసుకున్న కంపెనీల్లో సోనా కంస్టార్, శాన్‌ధార్‌ టెక్నాలజీస్, భారత్‌ ఫోర్జ్‌ ఉన్నాయి. మరోవైపు భారత్‌లో టెస్లా కార్ల కంపెనీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు ఎలాన్ మస్క్. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి ఆదరణ ఉందన్నారు. దీన్ని అందిపుచ్చుకోవాలంటే వీలైనంత ఎక్కువ కార్లు ఉత్పత్తి చేస్తామన్నారు.

ట్రెండింగ్ వార్తలు