Sushil Modi: జేడీయూ-ఆర్జేడీ కూటమిని విచ్ఛిన్నం చేస్తాం.. సుశీల్ మోదీ సంచలన వ్యాఖ్యలు

బిహార్‭లో బీజేపీ దోస్దీని విడిచిన అనంతరం.. మణిపూర్‭లో కూడా ఉన్న పొత్తును తెంచుకుంటున్నట్లు జేడీయూ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన ఒక రోజుకే జేడీయూకి షాక్ తగిలింది. మణిపూర్‭లో జేడీయూకి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండగా.. ఐదుగురు బీజేపీలో చేరారు. దీంతో మణిపూర్ జేడీయూ విభాగం అధికారికంగా బీజేపీలో విలీనం అయిపోయింది.

Sushil Modi: ‘‘చూస్తూ ఉండండి.. జేడీయూ-ఆర్జేడీ కూటమిని విచ్ఛిన్నం చేస్తాం’’ అంటూ బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మణిపూర్‭లో జనతాదళ్ యూనియన్ పార్టీ నేతలు భారతీయ జనతా పార్టీలో చేరడంపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాలో బీజేపీయేతర ప్రభుత్వాలు కూలిపోతుండడం.. అక్కడ బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వాలు ఏర్పడుతున్న తరుణంలో బిహార్‭లో ఆపరేషన్ కమలం ఊపందుకుందా అనే ఊహగాణాలకు సుశీల్ మాటలు దోహదపడుతున్నాయి.

కొద్ది రోజుల క్రితమే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. బీజేపీతో పొత్తు తెంచుకుని ఆర్జేడీతో జతకట్టారు. వాస్తవానికి 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కలిసే పోటీ చేశాయి. అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో జేడీయూ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ.. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు నితీశ్‭ను ముఖ్యమంత్రి చేశారు. అయితే సీఎం నితీశే అయినా.. పాలన మాత్రం బీజేపీ హైకమాండ్ చేస్తుందనే విమర్శలు అప్పట్లో బాగానే వినిపించాయి. అంతే కాకుండా పొత్తులో ఉన్నామని చూడకుండా బీజేపీ నేతలు తరుచూ నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండడం నితీశ్‭కు బాగా ఆగ్రహాన్ని కలిగించిందట.

ఇదిలా ఉంటే.. బిహార్‭లో బీజేపీ దోస్దీని విడిచిన అనంతరం.. మణిపూర్‭లో కూడా ఉన్న పొత్తును తెంచుకుంటున్నట్లు జేడీయూ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన ఒక రోజుకే జేడీయూకి షాక్ తగిలింది. మణిపూర్‭లో జేడీయూకి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండగా.. ఐదుగురు బీజేపీలో చేరారు. దీంతో మణిపూర్ జేడీయూ విభాగం అధికారికంగా బీజేపీలో విలీనం అయిపోయింది.

ఈ సందర్భాన్ని సుశీల్ గుర్తు చేస్తూ.. ‘‘ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో జేడీయూ విముక్త రాష్ట్రంగా మణిపూర్ అవతరించింది. ఆ ఎమ్మెల్యేలు ఎన్డీయేతోనే ఉంటామని అంటున్నారు. చూస్తూ ఉండండి.. బిహార్‭లో జేడీయూ-ఆర్జేడీ పొత్తును విచ్ఛిన్నం చేస్తాం. అనంతరం ఈ రాష్ట్రాన్ని కూడా జేడీయూ విముక్తంగా మారుస్తాం. పోస్టర్లు వేసుకుని, హోర్డింగులు పెట్టుకున్నంత మాత్రాన ప్రధాని కాలేరు. ఇది వాళ్లు ముందుగా తెలుసుకోవాలి’’ అని అన్నారు.

BJP MPs: బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీలపై కేసు నమోదు.. ఎందుకంటే..

ట్రెండింగ్ వార్తలు