helmetless cops : హెల్మెట్ లేకుండా స్కూటర్ నడిపిన మహిళా పోలీసులు ఫోటో వైరల్

నిత్యం ట్రాఫిక్ రూల్స్ పాటించమని జనానికి చెప్పేవారే నిబంధనలు ఉల్లంఘిస్తే? ముంబయిలో ఇద్దరు మహిళా పోలీసులు హెల్మెట్ లేకుండా స్కూటర్ మీద వెళ్తూ కెమెరాకి దొరికిపోయారు. వారి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

helmetless cops :  హెల్మెట్ (Helmet) లేని ప్రయాణం ప్రమాదకరం అని.. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే జరిమానా విధిస్తామని పోలీసులు (police) ప్రజలకు సూచిస్తారు. అలాంటిది పోలీసులు ఈ నియమాలు అతిక్రమిస్తే సామన్యులు ప్రశ్నిస్తారు కదా.. ఇప్పుడు ముంబయిలో (mumbai) అదే జరిగింది. హెల్మెట్ లేకుండా ఇద్దరు మహిళా పోలీసులు వాహనం నడుపుతున్న ఫోటోను ట్విట్టర్ యూజర్ ఒకరు పోస్ట్ చేయడంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది.

ప్రియాంక ఒక్క పోస్టుకి ఎంత తీసుకుంటుందో తెలుసా! – ముంబయిలో ఓ ఇల్లు కొనొచ్చు..

హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే జరిమానా ఖాయం. ముంబయిలో అయితే నడిపేవారితోపాటు వెనుక కూర్చున్నవారు సైతం హెల్మెట్ ధరించాలి. లేదంటే ఒక్కొక్కరూ 500 రూపాయలు జరిమనా కట్టాల్సి ఉంటుంది. ఇక ఇదే పరిస్థితి కొనసాగితే 3 నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను (driving licence) కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. అయితే తాజాగా ఇద్దరు మహిళా పోలీసులు హెల్మెట్ లేకుండా స్కూటర్‌పై ప్రయాణిస్తున్న ఫోటోను Rahul Barman అనే యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫోటో కింద “మేము ఇలా ప్రయాణిస్తే ఊరుకుంటారా? ఇది ట్రాఫిక్ నిబంధనలు (traffic rules) అతిక్రమించడం కాదా?” అని ప్రశ్నించాడు. ఈ ఫోటో చూసిన ముంబయి పోలీసులు వెంటనే స్పందించారు. ఈ ఫోటో తీసిన లొకేషన్ షేర్ చేయమని అడిగారు. ఈ విషయంపై విచారణ చేసి పై అధికారులకు విన్నవిస్తామని పోలీసులు తిరిగి సమాధానం చెప్పారు.

man dangerous bike stunt : ప్రియురాళ్లతో ఓ యువకుడి డేంజరస్ బైక్ స్టంట్.. ముంబయి పోలీసుల ట్వీట్

ఇక ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. బండి నంబర్ ప్లేట్ కనిపిస్తుండటంతో పోలీసులు ఈ-చలాన్ పంపించే అవకాశం ఉందని కొందరు. అందరికి చెప్పే వీరు బాధ్యతరహితంగా ప్రవర్తిస్తే ఎలా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు