Operation Maha: మహారాష్ట్రలో మరో సంక్షోభం.. శరద్ పవార్ పార్టీ నేతలు గెట్టు దాడుతున్నారా?

నవీ ముంబై మున్సిపల్ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఎన్సీపీకి సీనియర్ మాత్రమే కాకుండా, ఎన్సీపీ నవీ ముంబై అధ్యక్షుడైన గాడ్గే.. ఆదివారం షేండేను కలుసుకున్నారు. దీంతో ఇక ఎన్సీపీపై ఆపరేషన్ ప్రారంభమైందని కొందరు అంటున్నారు. ఈ చర్చలు ఇంతటితో ఆగకుండా.. తొందరలోనే ఆయన ఎన్సీపీకి గుడ్‭బై చెప్పి షిండే వర్గంలో చేరేందుకు సిద్ధమైనట్లు కూడా చెప్తున్నారు. ఆయనతో పాటు మరో ఆరుగురు కార్పొరేటర్లను కూడా తీసుకెళ్లబోతున్నారట.

Operation Maha: దేశవ్యాప్తంగా రాజకీయ సంచలనం సృష్టించిన మహారాష్ట్ర సంక్షోభంలో రెండవ విడత కుదుపు ప్రారంభైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే శివసేన పార్టీ చీలడం, చీలినవారంతా భారతీయ జనతా పార్టీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. అయితే ఇది ముగిసిన అనంతరం నుంచి తర్వాతి టార్గెట్ శరద్ పవార్ పార్టీనే అని అంచనాలు వెలువడ్డాయి. వాటికి బలం చేకూరుస్తున్నట్లే తాజా పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అశోక్ గావ్డే తాజాగా ముఖ్యమంత్రి షిండేను కలిశారు.

Satya Pal Malik: బీజేపీపై విమర్శలు, కాంగ్రెస్‭పై ప్రశంసలు.. మరింత దూకుడు పెంచిన బీజేపీ సీనియర్ నేత

నవీ ముంబై మున్సిపల్ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఎన్సీపీకి సీనియర్ మాత్రమే కాకుండా, ఎన్సీపీ నవీ ముంబై అధ్యక్షుడైన గాడ్గే.. ఆదివారం షేండేను కలుసుకున్నారు. దీంతో ఇక ఎన్సీపీపై ఆపరేషన్ ప్రారంభమైందని కొందరు అంటున్నారు. ఈ చర్చలు ఇంతటితో ఆగకుండా.. తొందరలోనే ఆయన ఎన్సీపీకి గుడ్‭బై చెప్పి షిండే వర్గంలో చేరేందుకు సిద్ధమైనట్లు కూడా చెప్తున్నారు. ఆయనతో పాటు మరో ఆరుగురు కార్పొరేటర్లను కూడా తీసుకెళ్లబోతున్నారట.

వాస్తవానికి గాడ్గేని కొద్ది రోజుల క్రితమే పార్టీ పదవి నుంచి తొలగించారు. ఈ మనస్థాపంతోనే ఆయన షిండే నేతృత్వంలోని శివసేనలో చేరబోతున్నారని అంటున్నారు. అయితే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‭కు అత్యంత సన్నిహితమైన వ్యక్తుల్లో గాడ్గే ఒకరు. ఇలాంటి నేతపై పార్టీ వేటు వేయడం, అనంతరం ఆయన పార్టీ మార్పు ఆలోచనల్లో ఉండడంతో రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో మరో సంక్షోభం చూడబోతున్నామా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

BJP next target NCP: ఉద్ధవ్ తర్వాతి బీజేపీ టార్గెట్ శరద్ పవార్!

ట్రెండింగ్ వార్తలు