Ghulam Nabi Azad: సొంత పార్టీ ఆలోచనలో ఆజాద్..? అందుకేనా కాంగ్రెస్‭కు రాజీనామా?

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఉనికిని గట్టిగా చాటుకోవాలని ఆజాద్ కోరుకుంటున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 73 ఏళ్ల ఆజాద్‌కు జమ్మూకశ్మీర్‌లో కీలక పదవికి కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఆఫర్ ఇచ్చినప్పటికీ ఆయన నిరాకరించారు. తొమ్మిదేళ్లుగా తాను చేసిన సిఫారసులను ఏఐసీసీ ఏరోజూ పట్టించుకోలేదని ఆజాద్ శుక్రవారం తన రాజీనామా లేఖలో విమర్శలు గుప్పించారు. రాహుల్‌ అపరిపక్వ నాయకత్వాన్ని ఎండగడుతూ విమర్శలు గుప్పించారు.

Ghulam nabi Azad: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీలోని తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం దేశ వ్యాప్తంగా తీవ్రకు చర్చకు తెరలేపింది. కాంగ్రెస్ పార్టీలో ఆయనను పక్కకు పెట్టినందు వల్లే రాజీనామా చేశారని ఎక్కువ మంది నుంచి వినిపిస్తుండగా.. కొద్ది మంది మాత్రం ఆయన సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకోబోతున్నారని, అందు కోసమే రాజీనామా చేశారని అంటున్నారు. సొంత రాష్ట్రం జమ్మూ కశ్మీర్ నుంచే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ఆజాద్ తన గ్రౌండ్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా పని చేసిన ఆజాద్.. జాతీయ స్థాయిలో మంచి పేరు ఉన్న నేత. అయితే ఆయన జాతీయ రాజకీయాల్లోకి వస్తారా, లేదంటే జమ్మూ కశ్మీర్ వరకే పరిమితమైపోతారా అనే ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి. అయితే సొంత పార్టీపై బహిరంగ ప్రకటనేదీ చేయని ఆజాద్.. ఒక ప్రముఖ పత్రికకు చెందిన విలేకరితో మాత్రం ‘‘ప్రస్తుతం అయితే నా సొంత రాష్ట్రం జమ్మూ కశ్మీర్‭లో పార్టీ పెడతాను. జాతీయ రాజకీయాలపై తర్వాత ఆలోచిస్తాను’’ అని అన్నట్లు సమాచారం.

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఉనికిని గట్టిగా చాటుకోవాలని ఆజాద్ కోరుకుంటున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 73 ఏళ్ల ఆజాద్‌కు జమ్మూకశ్మీర్‌లో కీలక పదవికి కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఆఫర్ ఇచ్చినప్పటికీ ఆయన నిరాకరించారు. తొమ్మిదేళ్లుగా తాను చేసిన సిఫారసులను ఏఐసీసీ ఏరోజూ పట్టించుకోలేదని ఆజాద్ శుక్రవారం తన రాజీనామా లేఖలో విమర్శలు గుప్పించారు. రాహుల్‌ అపరిపక్వ నాయకత్వాన్ని ఎండగడుతూ విమర్శలు గుప్పించారు.

PM Modi No1 Again: ప్రపంచ నేతల్లో నరేంద్ర మోదీయే మళ్లీ నెంబర్ 1

ట్రెండింగ్ వార్తలు