ICC ODI rankings : పాక్‌ను వెన‌క్కు నెట్టి.. మ‌ళ్లీ వ‌న్డేల్లో అగ్ర‌స్థానానికి చేరిన ఆసీస్‌.. టీమ్ఇండియా ఎక్క‌డంటే..?

గ‌త కొన్నాళ్లుగా వ‌న్డేల్లో అగ్ర‌స్థానానికి దూరం అయిన ఆస్ట్రేలియా (Australia) జ‌ట్టు మ‌ళ్లీ మొద‌టి ప్లేస్ దక్కించుకుంది. అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా ప్ర‌క‌టించిన వ‌న్డే ర్యాంకింగ్స్‌(ODI rankings)లో ఆసీస్ అగ్ర‌స్థానానికి చేరుకుంది.

Australia

ODI rankings : గ‌త కొన్నాళ్లుగా వ‌న్డేల్లో అగ్ర‌స్థానానికి దూరం అయిన ఆస్ట్రేలియా (Australia) జ‌ట్టు మ‌ళ్లీ మొద‌టి ప్లేస్ దక్కించుకుంది. అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా ప్ర‌క‌టించిన వ‌న్డే ర్యాంకింగ్స్‌(ODI rankings)లో ఆసీస్ అగ్ర‌స్థానానికి చేరుకుంది. ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొద‌టి రెండు వ‌న్డేల్లో గెలిచిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్‌ను వెన‌క్కు నెట్టి మొద‌టి స్థానానికి ఎగ‌బాకింది. ప్ర‌స్తుతం ఆసీస్ ఖాతాలో 121 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.

ఇక రెండో స్థానంలో ఉన్న పాకిస్తాన్ ఖాతాలో 120 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఆసీస్‌, పాక్ జ‌ట్ల మ‌ధ్య ఒక్క పాయింట్ మాత్ర‌మే అంత‌రం ఉంది. ఇక టీమ్ఇండియా విష‌యానికి వ‌స్తే 114 రేటింగ్ పాయింట్ల‌తో మూడో ర్యాంకులో కొన‌సాగుతోంది. ఆ త‌రువాత న్యూజిలాండ్ (106), ఇంగ్లాండ్ (99), సౌతాఫ్రికా (97), బంగ్లాదేశ్ (92), శ్రీలంక (92)లు వ‌రుస‌గా నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి.

Ind Vs Pak: కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్.. రోహిత్, గిల్ విధ్వంసం వల్లే.. మధ్యలో సచిన్ కూతురు ఏం చేసింది?

ఆసియాక‌ప్ 2023లో భాగంగా ఈ రోజు భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్ ప‌లితం త‌రువాత మొద‌టి మూడు ర్యాంకింగ్స్ ఛేంజ్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

డేవిడ్ వార్న‌ర్‌, ల‌బుషేన్ శ‌త‌కాల మోత‌..

ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన రెండో వ‌న్డేలో ఆస్ట్రేలియా 123 ప‌రుగుల భారీ తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు న‌ష్టాపోయి 392 ప‌రుగులు చేసింది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో డేవిడ్ వార్న‌ర్ (106 93 బంతుల్లో 12ఫోర్లు, 3 సిక్స‌ర్లు), మార్న‌స్‌ ల‌బుషేన్ (124 99 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్) శ‌త‌కాల‌తో విరుచుకుప‌డ‌గా, హెడ్ (64 36 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), జోష్ ఇంగ్లిస్ (50 37 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స్‌) హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో షమ్సీ నాలుగు వికెట్లు తీయ‌గా, రబాడ రెండు, మార్కో జానెసన్‌, ఫెహ్లుక్వాయో చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

David Warner సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసిన డేవిడ్ వార్నర్.. అదెంటో తెలుసా?

అనంత‌రం భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన సౌతాఫ్రికా 41.5 ఓవ‌ర్ల‌లో 269 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. స‌ఫారీ బ్యాట‌ర్ల‌లో క్లాసెన్ (49), డేవిడ్ మిల్ల‌ర్ (49), డికాక్ (45), బ‌వూమా(46)లు ఫ‌ర్వాలేద‌నిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్‌ జంపా నాలుగు వికెట్లు తీయ‌గా, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

ట్రెండింగ్ వార్తలు