Warner Pushpa Celebrations
David Warner Pushpa Celebrations : ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఉప్పల్ మైదానంలో పుష్ప స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అంతేకాదండోయ్.. శ్రీవల్లి పాట ప్లే అవుతుండగా ఆ పాట హుక్ స్టెప్‌తో రచ్చ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వన్డే ప్రపంచకప్ 2023కి సమయం దగ్గర పడింది. గురువారం నుంచి ప్రపంచకప్ మ్యాచులు ఆరంభం కానున్నాయి. అయితే.. అంతకంటే ముందు అన్ని జట్లు వార్మప్ మ్యాచులు ఆడుతున్నాయి. అందులో భాగంగా ఉప్పల్ మైదానంలో మంగళవారం పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేయగా లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ 47.4 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది.
పుష్ప స్టైల్లో వార్నర్ సెలబ్రేషన్స్..
తెలుగు వారితో వార్నర్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. దాదాపు ఏడేళ్ల పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన వార్నర్ ప్రజల మనసులను దోచుకున్నాడు. తెలుగు సాంప్రదాయాలను బాగా ఇష్ట పడే వార్నర్ తెలుగు చిత్రాలను కూడా ఫాలో అవుతాడు అన్న సంగతి తెలిసిందే. కరోనా లాక్డౌన్లో టిక్‌టాక్ లో వార్నర్ తెలుగు సినిమాల్లోని పాటలకు స్టెప్పులు వేయడంతో పాటు డైలాగులు చెప్పి ఆకట్టుకున్నాడు.
ICC World Cup 2023: టికెట్ల కోసం నన్ను అడగవద్దంటూ కోహ్లీ అభ్యర్థన.. అనుష్క శర్మ ఆసక్తికర రిప్లై
తాజాగా పాకిస్తాన్‌తో వార్మప్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో పుష్ప పాటకు స్టెప్పులేసి వార్నర్ అభిమానులను అలరించాడు. పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్‌ను సీన్ అబాట్ బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్లో అబ్దుల్లా షఫీక్ కొట్టిన బంతిని వార్నర్ క్యాచ్ గా పట్టుకున్నాడు. ఆ తరువాత తగ్గేదే లే అంటూ పుష్ప స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అనంతరం బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. పుష్ప చిత్రంలోని శ్రీవల్లి పాట ప్లే అవుతుండగా ఆ పాట హుక్ స్టెప్‌తో వార్నర్ అలరించాడు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Asian Games 2023: ఆర్చరీ క్రీడలో జ్యోతి సురేఖ, ఓజాస్ డియోటాలకు స్వర్ణ పతకం
David Warner showcasing his dance moves in Pushpa song on the Rajiv Gandhi Stadium !
Warner + Pushpa + Crowd@davidwarner31#PAKvsAUS #PAKvAUS #WarmUpMatch #ICCCricketWorldCup pic.twitter.com/OAbvvhXh0d
— Vikrant Gupta 🏏 (@VikrantGupta75) October 3, 2023