Glenn Maxwell : చ‌రిత్ర సృష్టించిన మాక్స్‌వెల్‌.. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ

ఆస్ట్రేలియా ఆట‌గాడు గ్లెన్ మాక్స్‌వెల్ చ‌రిత్ర సృష్టించాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లోనే ఫాస్టెస్ట్ శ‌త‌కం బాదిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు.

Glenn Maxwell

Glenn Maxwell Fastest hundred : ఆస్ట్రేలియా ఆట‌గాడు గ్లెన్ మాక్స్‌వెల్ చ‌రిత్ర సృష్టించాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్డేడియంలో నెద‌ర్లాండ్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో 40 బంతుల్లోనే సెంచ‌రీ చేసి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లోనే ఫాస్టెస్ట్ శ‌త‌కం బాదిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ క్ర‌మంలో ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు మార్‌క్ర‌మ్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 44 బంతులు ఎదుర్కొన్న మాక్స్‌వెల్ 9 ఫోర్లు, 8 సిక్స‌ర్లతో 106 ప‌రుగులు చేశాడు.

Also Read : అఫ్గానిస్థాన్ పై పాక్ ఓట‌మి.. బాబ‌ర్ కెప్టెన్సీ గోవిందా..!

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసిన ఆట‌గాళ్లు..

గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) – 40 బంతుల్లో నెద‌ర్లాండ్స్ పై – ఢిల్లీలో 2023 ప్ర‌పంచ‌క‌ప్ (నేటీ మ్యాచ్‌లో)
ఐడెన్ మార్‌క్ర‌మ్ (ద‌క్షిణాఫ్రికా) – 49 బంతుల్లో శ్రీలంక పై – ఢిల్లీలో 2023 ప్ర‌పంచ‌క‌ప్
కెవిన్ ఓబ్రియన్ (ఐర్లాండ్ ) – 50 బంతుల్లో ఇంగ్లాండ్ పై – బెంగళూరులో 2011 ప్ర‌పంచ‌క‌ప్‌
గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) – 51 బంతుల్లో శ్రీలంక పై – సిడ్నీలో 2015 ప్ర‌పంచ‌క‌ప్‌
ఏబీ డివిలియర్స్ (ద‌క్షిణాఫ్రికా) – 52 బంతుల్లో వెస్టిండీస్ పై – సిడ్నీలో 2015 ప్ర‌పంచ‌క‌ప్‌

నాలుగో స్థానం..

వ‌న్డేల్లో వేగవంతమైన సెంచ‌రీ చేసిన ఆట‌గాళ్ల జాబితాలో గ్లెన్ మాక్స్‌వెల్ నాలుగో స్థానంలో నిలిచాడు. 31 బంతుల్లోనే సెంచ‌రీ చేయ‌డం ద్వారా ద‌క్షిణాప్రికా ఆట‌గాడు ఏబీ డివిలియ‌ర్స్ ఈ జాబితాతో మొద‌టి స్థానంలో ఉన్నాడు. ఆ త‌రువాత కోరె అండ‌ర్స‌న్ (36 బంతుల్లో), షాహీద్ అఫ్రీది (37 బంతుల్లో) లు మాక్స్‌వెల్ క‌న్నా ముందు ఉన్నారు.

వ‌న్డేల్లో ఫాస్టెస్ట్ సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్లు..

ఏబీ డివిలియ‌ర్స్ (ద‌క్షిణాప్రికా) – 31 బంతుల్లో – వెస్టిండీస్ పై 2015లో జోహెన్న‌స్‌బ‌ర్గ్‌
కోరె అండ‌ర్స‌న్ (న్యూజిలాండ్‌) – 36 బంతుల్లో – వెస్టిండీస్ పై 2014లో క్వీన్స్ టౌన్
షాహీద్ అఫ్రీది (పాకిస్థాన్) – 37 బంతుల్లో – శ్రీలంక పై 1996లో నైరోబీ
గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా)- 40 బంతుల్లో- నెద‌ర్లాండ్స్ పై – 2023లో ఢిల్లీ (నేటీ మ్యాచ్‌)

Also Read : నెద‌ర్లాండ్స్ పై వార్న‌ర్ విధ్వంసం.. స‌చిన్ రికార్డు స‌మం.. ప‌లు రికార్డులు బ్రేక్‌..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మాక్స్‌వెల్‌తో పాటు డేవిడ్ వార్న‌ర్ (104; 93 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) సెంచ‌రీ బాద‌డంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 399 ప‌రుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (71), ల‌బుషేన్ (62) లు హాఫ్ సెంచ‌రీలతో రాణించారు. నెద‌ర్లాండ్స్ బౌల‌ర్ల‌లో లోగాన్ వాన్ బీక్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. బాస్ డి లీడే రెండు, ఆర్యన్ దత్ ఒక వికెట్ తీశారు.

ట్రెండింగ్ వార్తలు