ICC ODI Rankings : వ‌న్డే ర్యాంకింగ్స్‌లో గిల్‌, కిష‌న్‌ల దూకుడు.. రోహిత్‌, కోహ్లిల స్థానాలు ఏంటంటే..?

అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వ‌న్డే ర్యాకింగ్స్ (ICC ODI Rankings) ను ప్ర‌క‌టించింది. ఈ ర్యాకింగ్స్‌లో టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ (Shubman Gill), వికెట్ కీప‌ర్ ఇషాన్ కిష‌న్ (Ishan Kishan)లు అద‌ర‌గొట్టారు.

ICC ODI Rankings

ODI Rankings : అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వ‌న్డే ర్యాకింగ్స్ (ICC ODI Rankings) ను ప్ర‌క‌టించింది. ఈ ర్యాకింగ్స్‌లో టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ (Shubman Gill), వికెట్ కీప‌ర్ ఇషాన్ కిష‌న్ (Ishan Kishan)లు అద‌ర‌గొట్టారు. తాజా ర్యాంకింగ్స్‌లో గిల్ ఓ స్థానాన్ని మెరుగుప‌ర‌చుకుని 750 రేటింగ్ పాయింట్ల‌తో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఆసియాక‌ప్ 2023లో భాగంగా నేపాల్‌తో జ‌రిగిన‌ మ్యాచ్‌లో 62 బంతుల్లో 67 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిల‌వ‌డంతో త‌న స్థానాన్ని మెరుగుప‌ర‌చుకోగ‌లిగాడు.

Harbhajan Singh : చాహల్ కు చోటు లేదా.. హర్భజన్ సింగ్ ఆశ్చర్యం

అటు ఇషాన్ కిష‌న్ సైతం పాకిస్తాన్ పై అద్భుత ఇన్నింగ్ ఆడాడు. 82 ప‌రుగులు చేశాడు. దీంతో ఏకంగా 12 స్థానాల‌ను మెరుగుప‌ర‌చుకుని 24వ స్థానానికి చేరుకున్నాడు. వ‌న్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజామ్ 882 రేటింగ్ పాయింట్ల‌తో మొద‌టి స్థానంలో ఉన్నాడు. ఆ త‌రువాత ద‌క్షిణాఫ్రికాకు చెంది వాండ‌ర్ డ‌స్సెన్‌(777 రేటింగ్ పాయింట్లు), గిల్‌, ఇమామ్ ఉల్ హ‌క్ లు ఉన్నారు. ఇక భార‌త స్టార్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌లు టాప్‌-15లో కొన‌సాగుతున్నారు. విరాట్ కోహ్లి ప‌దో స్థానంలో, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 11వ స్థానంలో ఉన్నారు.

Rohit Sharma : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు కెప్టెన్‌గా త‌న పేరు ప్ర‌క‌టించ‌గానే.. రోహిత్ శ‌ర్మ రియాక్ష‌న్ చూశారా..?

టాప్‌-10 వ‌న్డే బ్యాట‌ర్ల ర్యాంకింగ్ జాబితా ఇదే..

బాబర్ ఆజం (882) – పాకిస్తాన్
రస్సీ వాండర్ డస్సెన్ (777) – దక్షిణాఫ్రికా
శుబ్‌మన్‌ గిల్ (750) – భారత్‌
ఇమామ్-ఉల్-హక్ (732) -పాకిస్తాన్
హ్యారీ టెక్టర్ (726) -ఐర్లాండ్
డేవిడ్ వార్నర్ (726) – ఆస్ట్రేలియా
ఫఖర్ జమాన్ (721) – పాకిస్తాన్
క్వింటన్ డి కాక్ (718) – దక్షిణాఫ్రికా
స్టీవ్ స్మిత్ (702)- ఆస్ట్రేలియా
విరాట్ కోహ్లీ (695) – భారత్‌

ట్రెండింగ్ వార్తలు