ODI World Cup 2023 : పాకిస్థాన్‌తో మ్యాచ్‌.. గోల్డ్‌ మెడల్ అందుకుంది ఎవ‌రో తెలుసా..?

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ ఆరంభం నుంచి టీమ్ఇండియా ఓ కొత్త‌ ప‌ద్ద‌తిని అనుస‌రిస్తోంది. టీమ్‌ఇండియా ఆడిన ప్రతి మ్యాచ్‌లో ఉత్తమంగా ఫీల్డింగ్‌ చేసిన ఆటగాడికి ‘బెస్ట్ ఫీల్డర్’ అవార్డుతో పాటు గోల్డ్ మెడల్ ను అందిస్తోంది.

KL Rahul Receives Best Fielder Medal

ODI World Cup : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా వ‌రుస విజ‌యాల‌తో జోష్‌లో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలుపొందింది. కాగా.. ఈ మెగాటోర్నీ ఆరంభం నుంచి టీమ్ఇండియా ఓ కొత్త‌ ప‌ద్ద‌తిని అనుస‌రిస్తోంది. టీమ్‌ఇండియా ఆడిన ప్రతి మ్యాచ్‌లో ఉత్తమంగా ఫీల్డింగ్‌ చేసిన ఆటగాడికి ‘బెస్ట్ ఫీల్డర్’ అవార్డుతో పాటు గోల్డ్ మెడల్ ను అందిస్తోంది. భార‌త ఫీల్డింగ్ కోచ్ దిలీప్ చేతుల మీదుగా బెస్ట్ పీల్డ‌ర్ అవార్డుతో పాటు గోల్డ్ మెడ‌ల్‌ను ఇస్తున్నారు.

మొట్ట మొద‌టి గోల్డ్ మెడ‌ల్‌ను విరాట్ కోహ్లీ అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచులో అద్భుమైన ఫీల్డింగ్‌తో అల‌రించ‌డంతో అత‌డికి ఈ అవార్డు ల‌భించింది. ఇక అఫ్గానిస్థాన్తో జ‌రిగిన రెండో మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్‌కు ఈ అవార్డు ల‌భించింది. దీంతో శ‌నివారం పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో బెస్ట్ ఫీల్డ‌ర్‌గా నిలిచి ఈ గోల్డ్ మెడ‌ల్‌ను ఎవ‌రు అందుకున్నారో అనే ఆస‌క్తి అంద‌రిలో ఉంది.

బెస్ట్ పీల్డ‌ర్ ఎవ‌రంటే..?

టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ కేఎల్ రాహుల్ ఈ అవార్డు అందుకున్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో సిరాజ్‌, కుల్‌దీప్‌ యాదవ్, శార్దూల్ ఠాకూర్‌, బుమ్రా, జడేజా, శ్రేయస్ అయ్యర్ మైదానంలో చురుగ్గా పరుగెత్తార‌ని ఫీల్డింగ్ కోచ్ దిలీప్ తెలిపారు. అయితే.. ఇమామ్ ఉల్ హ‌క్ క్యాచ్ అందుకోవ‌డంతో పాటు వికెట్ల వెనుకాల రాణించినందుకు కేఎల్ రాహుల్ ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన‌ట్లు పేర్కొన్నారు.

Rohit Sharma : నా కండ‌లు చూశావా..? అంపైర్‌తో రోహిత్ శ‌ర్మ‌.. వీడియో వైర‌ల్

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42.5 ఓవ‌ర్ల‌లో 191 ప‌రుగుల‌కు ఆలౌటైంది. పాకిస్థాన్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ బాబ‌ర్ ఆజాం (50) హాఫ్ సెంచ‌రీ చేశాడు. మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (49), ఇమామ్ ఉల్ హక్ (36)లు రాణించారు. టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్ యాద‌వ్, హార్ధిక్ పాండ్య‌, ర‌వీంద్ర జ‌డేజా లు త‌లా రెండు వికెట్లు తీశారు. అనంత‌రం ల‌క్ష్యాన్ని భార‌త్ 30.3 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శ‌ర్మ (86; 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాగా.. శ్రేయ‌స్ అయ్య‌ర్ (53 నాటౌట్‌; 62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు