ODI World Cup 2023 : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 ప్రారంభ వేడుక‌లు ర‌ద్దు..!

భార‌త్ వేదిక‌గా ఐసీసీ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 మ‌రో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. ఈ క్ర‌మంలో ఓపెనింగ్ సెర్మ‌నీని ఎంతో ఘ‌నంగా భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్వ‌హిస్తుంద‌ని అంతా భావిస్తున్నారు.

No ODI World Cup Opening Ceremony

ODI World Cup 2023 Opening Ceremony : భార‌త్ వేదిక‌గా ఐసీసీ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 మ‌రో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. ఈ క్ర‌మంలో ఓపెనింగ్ సెర్మ‌నీని ఎంతో ఘ‌నంగా భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్వ‌హిస్తుంద‌ని అంతా భావిస్తున్నారు. మెగా టోర్నీకి ఒక్క రోజు ముందు అంటే అక్టోబ‌ర్ 4న ఈ వేడుక‌ను నిర్వ‌హించేందుకు బీసీసీఐ మొద‌ట ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసింది. అయితే.. ఇప్పుడు ఓపెనింగ్ సెర్మ‌నీని ర‌ద్దు చేసిన‌ట్లు తెలుస్తోంది.

అక్టోబ‌ర్ 5న మొద‌టి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్ కు అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. కాగా.. బుధ‌వారం (అక్టోబ‌ర్ 4న‌) ఈ స్టేడియంలోనే నిర్వ‌హించాల‌ని అనుకున్న ఓపెనింగ్ సెర్మ‌నీకి బ‌దులు అక్టోబ‌ర్‌ 14న ఇదే స్టేడియంలో జ‌ర‌గ‌నున్న భార‌త్, పాకిస్థాన్ మ్యాచ్ కు ముందుగానీ, లేదంటే టోర్నీ ముగిసిన త‌రువాత క్లోజింగ్ సెర్మ‌నీ గా గానీ నిర్వ‌హించాల‌ని బీసీసీఐ భావిస్తున్న‌ట్లు దైనిక్ జాగరణ్ త‌న క‌థ‌నంలో పేర్కొంది. అయితే.. ఓపెనింగ్ సెర్మ‌నీ విష‌యంలో బీసీసీఐ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

కెప్టెన్స్ డే..

ఓపెనింగ్ సెర్మ‌నీ ర‌ద్దు అయిన‌ప్ప‌టికీ కెప్టెన్స్ డే ను య‌థావిధిగా నిర్వ‌హించాల‌ని బీసీసీఐ భావిస్తోంద‌ట‌. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొన‌నున్న మొత్తం 10 జ‌ట్ల కెప్టెన్లు అక్టోబ‌ర్ 3న అహ్మ‌దాబాద్‌కు చేరుకోనున్నారు. అక్టోబ‌ర్ 4న‌ ఫోటో సెష‌న్‌తో పాటు కెప్టెన్లు మీడియా స‌మావేశాల‌ను నిర్వ‌హించనున్నారు.

ప్రపంచ‌క‌ప్‌లో కెప్టెన్లు వీరే..

టీమ్ఇండియా : రోహిత్ శర్మ
ఆస్ట్రేలియా : పాట్ కమిన్స్
ఇంగ్లాండ్ : జోస్ బట్లర్
పాకిస్తాన్ : బాబర్ ఆజం
న్యూజిలాండ్ : కేన్ విలియమ్సన్
శ్రీలంక : దసున్ షనక
బంగ్లాదేశ్ : షకీబ్ అల్ హసన్
నెదర్లాండ్స్ : స్కాట్ ఎడ్వర్డ్స్
దక్షిణాఫ్రికా: టెంబా బావుమా
అఫ్గానిస్తాన్ : హష్మతుల్లా షాహిది

ట్రెండింగ్ వార్తలు