Most Sixes: ఆస్ట్రేలియా సిక్సర్ల రికార్డు.. ఎన్ని సిక్సర్లు కొట్టిందో తెలుసా?

న్యూజిలాండ్ తో మ్యాచ్ లో ఆస్ట్రేలియా దుమ్మురేపింది. ఆసీస్ బ్యాటర్లు భారీ సిక్సర్లతో కివీస్ పై విరుచుకుపడ్డారు.

ODI world cup 2023 australia most sixes record

Australia Most Sixes Record: న్యూజిలాండ్ తో మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. వరల్డ్ కప్ ఆసీస్ తమ మూడో అత్యుత్తమ స్కోరు నమోదు చేసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటయింది. 2015లో అఫ్గానిస్తాన్ తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 417/6 స్కోరు చేసింది. తాజా ప్రపంచకప్ లో ఢిల్లీలో నెదరాండ్స్ తో జరిగి మ్యాచ్ లో 399/8 స్కోరు నమోదు చేసింది.

ఆస్ట్రేలియా తరఫున వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు ఈరోజే నమోదయ్యాయి. వన్డే వరల్డ్ కప్ టీమ్ ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఈరోజు మ్యాచ్ లో ఆసీస్ బ్యాటర్లు 20 సిక్సర్లు కొట్టారు. 2019లో మాంచెస్టర్ లో అఫ్గానిస్తాన్ తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ లో ఇంగ్లండ్ టీమ్ ఏకంగా 25 సిక్సర్లు బాదింది. 2015లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ 19 సిక్సర్లు కొట్టింది. తాజా వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో బెంగళూరులో మ్యాచ్ లో ఆస్ట్రేలియా 19 సిక్సర్లు నమోదు చేసింది.

వన్డే ప్రపంచకప్ లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్లలో డేవిడ్ వార్నర్(36) నాలుగో స్థానానికి చేరుకున్నాడు. క్రిస్ గేల్(49), రోహిత్ శర్మ(40), డివిలియర్స్ (37) అతడి కంటే ముందున్నారు. గ్లెన్ మాక్స్‌వెల్(33), రికీ పాంటింగ్(31) వార్నర్ తర్వాత స్థానాల్లో ఉన్నారు.

Also Read: పాకిస్థాన్ సెమీస్ దారులు మూసుకుపోలేదా..? ఇంకా అవ‌కాశం ఉందా..? ఎలాగో తెలుసా..?

అంతేకాదు ప్రపంచకప్ లో వరుసగా మూడుసార్లు 350 ప్లస్ స్కోరు చేసిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డుకెక్కింది. 388, 399/8, 367/9 స్కోర్లు నమోదు చేసి వరల్డ్ కప్ లో
ఆసీస్ ఆధిపత్యాన్ని చాటింది.

 

ట్రెండింగ్ వార్తలు