ODI World Cup 2023 : పాకిస్థాన్ ను చిత్తుచేసిన అఫ్గానిస్థాన్.. పాక్ జట్టు సెమీఫైనల్‌కు చేరే అవకాశాలున్నాయా? ఎలా అంటే

పాకిస్థాన్ - అఫ్గాన్ మ్యాచ్ తరువాత పాయింట్ల పట్టికలో.. భారత్ జట్టు అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానంలో న్యూజిలాండ్ జట్టు నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి.

Pakistan Team

ODI World Cup 2023 Pakistan Team : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో అఫ్గానిస్థాన్ జట్టు మరోసారి సంచలనం సృష్టించింది. మొన్న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ జట్టుపై సంచలన విజయాన్ని నమోదు చేసిన ఆ జట్టు.. తాజాగా పాకిస్థాన్ జట్టుపై విజయం సాధించింది. సోమవారం చెన్నై స్టేడియంలో పాకిస్థాన్ వర్సెస్ అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆఫ్గాన్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి పాక్ జట్టుకు షాకిచ్చింది. ఈ విజయంతో అఫ్గానిస్థాన్ చరిత్రలో తొలిసారిగా వన్డేలో పాకిస్థాన్ జట్టును ఓడించినట్లయింది. పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో ఆ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన అఫ్గాన్ బ్యాటర్లు అద్బుత ప్రతిభ కనబర్చారు. ఫలితంగా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 49 ఓవర్లలో 286 పరుగులు చేసి అఫ్గాన్ జట్టు విజయం సాధించింది.

Read Also : Afghanistan Win : వరల్డ్‌కప్‌లో మరో సంచలనం.. పాకిస్థాన్‌పై అఫ్ఘానిస్థాన్ ఘన విజయం

వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ జట్టు ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లు ఆడింది. ఈ ఐదు మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లలోనే విజయం సాధించింది. వరుసగా జరిగిన ఇండియా, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ జట్ల పై ఓడిపోయింది. ఫలితంగా సెమీస్ ఆశలను ఆ జట్టు క్లిష్టతరం చేసుకుంది. పాకిస్థాన్ జట్టు మరో నాలుగు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లతో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఒకవేళ పాకిస్థాన్ జట్టు సెమీస్ కు చేరాలంటే వచ్చే నాలుగు మ్యచ్ లలో తప్పనిసరిగా విజయం సాధించాల్సిన అవసరం ఉంది. పాక్ వచ్చే నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించినప్పటికీ.. మెగాటోర్నీలో మిగతా జట్ల రన్ రేట్, పాయింట్లపై పాక్ జట్టు సెమీస్ కు చేరే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

Read Also : Bishan Singh Bedi : భారత మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి కన్నుమూత

పాకిస్థాన్ – అఫ్గాన్ మ్యాచ్ తరువాత పాయింట్ల పట్టికలో.. భారత్ జట్టు అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానంలో న్యూజిలాండ్ జట్టు నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి. పాకిస్థాన్ మిగిలిన నాలుగు మ్యాచ్ లలో విజయం సాధిస్తే సెమీస్ కు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి. 2019 వరల్డ్ కప్ లో 11 పాయింట్లతో ఐదు విజయాలు సాధించినప్పటికీ పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్ లో చోటు కోల్పోయింది. పాకిస్థాన్ అర్హత సెమీ ఫైనల్ కు అర్హత సాధించాలంటే ఆరు విజయాలు అవసరం. దీనికితోడు రన్ రేట్ మెరుగు పర్చుకోవాలి. ఒకవేళ పాక్ వచ్చే నాలుగు మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ ఓడిపోయినా సెమీ ఫైనల్ కు చేరాలంటే మిగిలిన జట్ల ఆటతీరును బట్టి అవకాశం ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు