ODI World Cup 2023: తొలి పోరుకు సిద్ధమైన భారత్.. వారిద్దరికీ తుదిజట్టులో చోటు ఖాయమా? రోహిత్ ను ఊరిస్తున్న రికార్డులివే..

మిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈరోజు జరిగే మ్యాచ్ లో సెంచరీ సాధిస్తే సచిన్ రికార్డును అధిగమిస్తాడు. ప్రపంచ కప్ చరిత్రలో రోహిత్ సెంచరీలు ఆరు ఉన్నాయి. సచిన్ సెంచరీలు సైతం ఆరు ఉన్నాయి. ఈ టోర్నీలో రోహిత్ సెంచరీ చేస్తే ..

India vs Australia Match

ODI World Cup 2023 India vs Australia Match: భారత్ వేదికగా ఐసీసీ పురుషుల వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభమైంది. ఈ నెల 5 నుంచి మెగా టోర్నీలో మ్యాచ్ లు జరుగుతున్నాయి. అయితే, ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లకు స్టేడియంలలో ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో కనిపించలేదు. దీంతో ఆదివారం మ్యధ్నాహ్నం 2గంల నుంచి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ తో వరల్డ్ కప్ – 2023కు కొత్త ఉత్సాహం వస్తుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు. ఇండియా, ఆస్ట్రేలియా జట్లకు ఈ మెగాటోర్నీలో తొలి మ్యాచ్ కావడంతో విజయమే లక్ష్యంగా అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.

virat kohli and steve smith (Google Image)

ఆస్ట్రేలియాదే హవా..
వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఇండియాపై ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. ఈ రెండు జట్ల మధ్య మొత్తం 12సార్లు మ్యాచ్ లు జరగ్గా.. ఆస్ట్రేలియా ఎనిమిది మ్యాచ్ లలో విజయం సాధించింది. భారత్ జట్టు మాత్రం కేవలం నాలుగు మ్యాచ్ లలోనే విజయం సాధించింది. అయితే, చెన్నైలో ఈ రెండు జట్లు మూడు సార్లు తలపడ్డాయి. ఒక మ్యాచ్ లో భారత్ విజయం సాధించగా.. రెండు మ్యాచ్ లలో ఆస్ట్రేలియా విజయం సాధించింది.

వారిద్దరికీ తుదిజట్టులో చోటు ఖాయమా?
ఈ రోజు మధ్యాహ్నం జరిగే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్ మన్ గిల్ ఆడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. డెంగీ కారణంగా గిల్ ఇబ్బంది పడుతున్నాడు. అయితే, చివరి నిమిషంలో అతని ఆరోగ్య పరిస్థితి, ఫిట్ నెస్ ను బట్టి తుది జట్టులోకి తీసుకొనే అవకాశం ఉంది. గిల్ తుది జట్టులో చేరకుంటే వికెట్ కీపర్ ఇషాంత్ కిషన్ తుదిజట్టులోకి చేరనున్నారు. రోహిత్ శర్మతో కలిసి ఇషాంత్ ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు. బ్యాటింగ్ విభాగంలో రోహిత్, ఇషాన్ కిషన్, కోహ్లీ, రాహుల్, శ్రేయాస్ మంచి ఫామ్ ను కొనసాగిస్తే భారత్ విజయం నల్లేరుపై నడకే అవుతుంది. హార్ధిక్ పాండ్యా చేతి వేలికి గాయమైందని తెలిసింది. అయితే, హార్దిక్ తుది జట్టులో ఉంటారని తెలిస్తుంది. బౌలింగ్ విభాగంలో బుమ్రా, సిరాజ్ లు ఆరంభంలో ప్రభావం చూపిస్తే జట్టు విజయానికి మేలు చేస్తుంది. స్పిన్ విభాగంలో ముగ్గురిని బరిలోకి దింపాలని కెప్టెన్ రోహిత్ భావిస్తున్నారు. చెపాక్ స్టేడియం స్పిన్నర్లకు అనుకూలమైన పిచ్ కావడంతో ముగ్గు స్పిన్నర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో కుల్దీప్ తో పాటు సొంతగడ్డపై మ్యాచ్ కావడంతో రవిచంద్ర అశ్విన్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. మూడో స్పిన్నర్ అవసరం అనుకుంటే జడేజాకు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

Team india

రోహిత్ ను ఊరిస్తున్న రికార్డులివే..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈరోజు జరిగే మ్యాచ్ లో సెంచరీ సాధిస్తే సచిన్ రికార్డును అధిగమిస్తాడు. ప్రపంచ కప్ చరిత్రలో రోహిత్ సెంచరీలు ఆరు ఉన్నాయి. సచిన్ సెంచరీలు సైతం ఆరు ఉన్నాయి. ఈ టోర్నీలో రోహిత్ సెంచరీ చేస్తే టోర్నీలో అత్యధిక శతకాల వీరుడవుతాడు. అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లలో) రోహిత్ సిక్సర్ల సంఖ్య 551గా ఉంది. ఈ రోజు జరిగే మ్యాచ్ లో మూడు సిక్సులు కొడితే క్రిస్ గేల్ (553)ను అధిగమించి అత్యధిక సిక్సర్ల రికార్డును రోహిత్ సొంతం చేసుకుంటాడు.

తుది జట్లు (అంచనా) :
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్/గిల్, కోహ్లీ, శ్రేయాస్, రాహుల్, హార్ధిక్ పాండ్యా, కుల్దీప్, అశ్విన్, షమీ/జడేజా, బుమ్రా, సిరాజ్.
ఆస్ట్రేలియా : వార్నర్, మిచెల్ మార్ష్, స్మిత్, లుబుషేన్, మ్యాక్స్ వెల్, కేరీ, గ్రీన్, కమిన్స్ (కెప్టెన్), స్టార్క్, హేజిల్ వుడ్, జంపా.

ట్రెండింగ్ వార్తలు