Shreyas Iyer : శ్రేయ‌స్ ది ఔటా..? కాదా..? సీన్ అబాట్ ప‌ట్టిన‌ క్యాచ్ పై దుమారం..!

ఇండోర్ వేదిక‌గా భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం దీనిపై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది.

Ind vs Aus 2nd ODI

Shreyas Iyers catch controversy : ఇండోర్ వేదిక‌గా భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం దీనిపై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. శ‌త‌క వీరుడు శ్రేయ‌స్ అయ్య‌ర్ (Shreyas Iyer) ఇచ్చిన క్యాచ్ ను సీన్ అబాట్ అందుకున్నాడు. అయితే.. బంతి నేల‌ను తాకుతుందంటూ థ‌ర్డ్ అంఫైర్ నాటౌట్ ఇచ్చాడు. ఈ వివాదాస్ప‌ద క్యాచ్‌పై నెటీజ‌న్లు రెండు విడిపోయారు.

ఏం జ‌రిగిందంటే..?

భార‌త ఇన్నింగ్స్ లో 31వ ఓవ‌ర్‌ను సీన్ అబాట్ వేశాడు. ఆ ఓవ‌ర్‌లోని మూడో బంతిని ఫుట్‌టాస్‌గా వేయ‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్ షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నించ‌గా మిస్ టైమింగ్ కావ‌డంతో బంతి నాన్ స్ట్రైక‌ర్ ఎండ్ వైపు వెళ్లింది. కాగా.. బౌలింగ్ వేసిన‌ అబాట్ అదే ర‌న్న‌ప్‌లో డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో అయ్య‌ర్ తాను ఔట్ అని భావించి పెవిలియ‌న్‌కు వెలుతుండ‌గా.. ఫీల్డ్ అంపైర్ల సూచ‌న‌ల‌తో థ‌ర్డ్ అంపైర్ అనంతపద్మనాభన్ క్యాచ్ అందుకున్న విధానాన్ని ప‌లు కోణాల్లో ప‌రిశీలించాడు.

క్యాచ్ ప‌ట్టుకునే క్ర‌మంలో బంతి నేల‌ను తాకిన‌ట్లుగా గుర్తించాడు. నిబంధ‌న‌ల ప్ర‌కారం క్యాచ్ టేకింగ్ ప్ర‌క్రియ‌లో బంతిపై ఫీల్డ‌ర్ నియంత్ర‌ణ‌లో ఉండాలి. అదే స‌మ‌యంలో బంతి నేల‌ను తాక‌కుండా చూసుకోవాలి. దీంతో థ‌ర్డ్ అంపైర్ అయ్య‌ర్‌ను నాటౌట్‌గా ప్ర‌క‌టించాడు. అయితే.. ఈ సంతోషం ఎంతో సేపు నిల‌వ‌లేదు. మ‌రో రెండు బంతుల్లోనే అబాట్ బౌలింగ్‌లో అయ్య‌ర్ ఔటై పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. నాలుగో బంతికి ఫోర్ కొట్టిన అయ్య‌ర్‌, ఐదో బంతికి బౌండ‌రీ లైన్ వ‌ద్ద మాథ్యూ షాట్ చేతికి చిక్కాడు.

రెండుగా విడిపోయిన అబిమానులు..

కాగా.. అబాట్ క్యాచ్ పై నెటీజ‌న్లు రెండు వ‌ర్గాలు విడిపోయారు. థ‌ర్డ్ అంఫైర్ తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌దే అని కొంద‌రు అంటుండ‌గా, కాద‌ని మ‌రికొంద‌రు వాదిస్తున్నారు. సీన్ అబాట్ క్యాచ్ అందుకునే క్ర‌మంలో పూర్తి నియంత్ర‌ణ‌లోనే ఉన్నాడ‌ని, శ్రేయ‌స్ ఔట్ ఇవ్వాల్సి ఉండాల‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే.. శ్రేయ‌స్ అయ్య‌ర్ రెండు బంతుల్లో ఔట్ కావ‌డంతో మ‌రీ ఇది పెద్ద వివాదంగా మార‌లేదు.

Shubman Gill : శుభ్‌మ‌న్ గిల్ అరుదైన ఘ‌న‌త‌.. ధావ‌న్‌, రాహుల్‌, కోహ్లీ రికార్డు బ‌ద్ద‌లు

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. శ్రేయ‌స్ అయ్య‌ర్ (105; 90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), శుభ్‌మ‌న్ గిల్ (104; 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు)లు శ‌త‌కాలతో చెల‌రేగ‌గా, సూర్య‌కుమార్ యాద‌వ్ (72నాటౌట్; 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స‌ర్లు), కేఎల్ రాహుల్ (52; 38 బంతుల్లో 3 ఫోర్లు, 3సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కాల‌తో రాణించ‌డంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 399 ప‌రుగులు చేసింది.

ట్రెండింగ్ వార్తలు