Asian Games : భార‌త్ ఖాతాలో మ‌రో స్వ‌ర్ణం.. అద‌ర‌గొట్టిన రోహన్‌ బొపన్న- రుతుజ జోడీ

చైనా వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క్రీడ‌ల్లో (Asian Games) భార‌త్‌.. ప‌త‌కాల పంట పండిస్తోంది.

Rohan Bopanna-Rutuja Bhosale

Asian Games 2023 : చైనా వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క్రీడ‌ల్లో (Asian Games) భార‌త్‌.. ప‌త‌కాల పంట పండిస్తోంది. టెన్నిస్ విభాగంలో దేశానికి మొద‌టి గోల్డ్ మెడ‌ల్ ల‌భించింది. శ‌నివారం జ‌రిగిన మిక్స్‌డ్ డ‌బుల్స్ ఫైన‌ల్‌లో భారత్‌కు చెందిన‌ రోహన్‌ బోపన్న- రుతుజా భోసలే జోడీ తైఫీకి చెందిన సంగ్‌-లియాంగ్‌ జోడీపై 2-6, 6-3, 10-4 తేడాతో గెలుపొందింది. త‌ద్వారా స్వ‌ర్ణ ప‌త‌కం గెలుచుకుంది. దీంతో భార‌త్ ఖాతాలో తొమ్మిదో స్వ‌ర్ణం చేరింది. ఈ ఆసియా క్రీడ‌ల్లో 35 ప‌త‌కాల‌తో భార‌త్ ప్ర‌స్తుతం ఐదో స్థానంలో కొన‌సాగుతోంది.

Mixed doubles final match Asian Games 2023

అంతకముందు.. సరబ్‌జోత్ సింగ్, దివ్య తడిగోల్ జోడి షూటింగ్ విభాగంలో రజత పతకం సొంతం చేసుకుంది. పది మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో ఈ జోడి ప‌త‌కం గెలుచుకుంది. దీంతో షూటింగ్ విభాగంలో పతకాల సంఖ్య 19కి చేరుకుంది.

Rohan Bopanna Rutuja Bhosale winning moments

ట్రెండింగ్ వార్తలు