Ind vs Aus 3rd ODI : లబుషేన్‌ను టీజ్ చేసిన విరాట్ కోహ్లీ.. వీడియో వైర‌ల్‌

ప‌రుగుల యంత్రం, రికార్డు రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అంద‌రికి తెలిసిందే.

Kohli teasing Labuschagne

India vs Australia 3rd ODI : రాజ్‌కోట్ వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు మూడో వ‌న్డేలో త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా (Australia) బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ పిచ్ పై ఆసీస్ బ్యాట‌ర్లు ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నారు. ఓపెన‌ర్లు డేవిడ్ వార్న‌ర్‌(56), మిచెల్ మార్ష్ (96)ల‌తో పాటు వ‌న్ డౌన్ బ్యాట‌ర్ స్టీవ్ స్మిత్ (74)లు దూకుడుగా ఆడి అర్థ‌శ‌త‌కాలు బాది జ‌ట్టు భారీ స్కోరుకు బాట‌లు వేశారు. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా 35 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు 254 ప‌రుగులు చేసింది.

ప‌రుగుల యంత్రం, రికార్డు రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అంద‌రికి తెలిసిందే. ఇక ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్ల‌ను అప్పుడ‌ప్పుడు కౌవ్విస్తూ ఉండ‌డ‌టాన్ని చూస్తూనే ఉంటాం. తాజాగా రాజ్‌కోట్ వ‌న్డేలో ల‌బుషేన్ (Labuschagne ) ను విరాట్ కోహ్లీ స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించాడు. మిచెల్ మార్ష్ ఔట్ కావ‌డంతో కొత్త బ్యాట‌ర్‌గా ల‌బుషేన్ క్రీజులోకి అడుగుపెట్టాడు.

Virat Kohli: చిన్ననాటి ఫొటోలోని స్టైల్‌ను రీక్రియేట్ చేస్తూ పోజులిచ్చిన విరాట్ కోహ్లీ.. ఫొటోలు వైరల్

అదే స‌మ‌యంలో ఎండ ఎక్కువ‌గా ఉండ‌డంతో స్టీవ్ స్మిత్ చైర్‌లో కూర్చోని డ్రింక్స్ తాగుతుండ‌గా.. ల‌బుషేన్ వ‌ద్ద‌కు వ‌చ్చిన విరాట్ కోహ్లీ స‌ర‌దాగా అత‌డిని టీజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు