Asia Cup 2023: ఆసియా కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్‌లో భారత్ వర్సెస్ పాక్ జట్లు? అలా జరగాలంటే పాకిస్థాన్ ఏం చేయాలో తెలుసా..

ఆసియా కప్ చరిత్రలో పాకిస్థాన్, భారత్ జట్లు ఇప్పటి వరకు ఫైనల్స్ లో తలపడలేదు. ఈసారి రెండు జట్ల మధ్య ఫైనల్ పోరు ఖాయంగా కనిపిస్తోంది..

india vs pakistan match

India vs Pakistan Match: ఆసియా కప్ 2023 టోర్నీ చివరి దశకు చేరింది. సూపర్ -4లో (Super 4) నాలుగు జట్లు తలపడుతున్నాయి. అయితే, మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ జట్టు (Team India) విజయం సాధించడం ద్వారా ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఫైనల్‌లోకి వెళ్లేందుకు బంగ్లాదేశ్ జట్టు అర్హత కోల్పోయింది. ఇక పాకిస్థాన్, శ్రీలంక జట్లలో ఏ జట్టు ఫైనల్‌కు చేరుతుందనే విషయం ఆసక్తికరంగా మారింది. ఆసియా కప్ చరిత్రలో పాకిస్థాన్, భారత్ జట్లు ఇప్పటి వరకు ఫైనల్స్ లో తలపడలేదు. ఈసారి రెండు జట్ల మధ్య ఫైనల్ పోరు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గురువారం సాయంత్రం శ్రీలంక, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లలో ఏ జట్టు వియం సాధిస్తే ఆ జట్టు భారత్ తో ఫైనల్స్ లో ఆడుతుంది.

Asia Cup 2023: శ్రీలంకపై మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్స్ సరికొత్త రికార్డులు.. ఆ లిస్ట్‌లో రోహిత్, కుల్దీప్, జడేజాలు

పాయింట్ల పట్టిక ప్రకారం చూస్తే.. ఆసియా కప్ సూపర్-4లోకి నాలుగు జట్లు ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ప్రవేశించాయి. ఇండియా రెండు మ్యాచ్ లలో రెండు విజయాలు సాధించింది. శ్రీలంక, పాకిస్థాన్ జట్లు రెండు మ్యాచ్ లలో ఒక్కో విజయంతో ఉన్నాయి. బంగ్లాదేశ్ జట్టు రెండు మ్యాచ్‌లను ఓడిపోయింది. ఈనెల 15న ఇండియాతో బంగ్లాదేశ్ తలపడుతుంది. ఒకవేళ ఇండియాపై విజయం సాధించినా ఆ జట్టు ఫైనల్స్ కు చేరుకోలేదు.

IND vs SL : శ్రీలంక చిత్తు.. భారత్ ఘన విజయం

ఆసియా కప్ 2023లో ఇప్పటికే ఇండియా ఫైనల్‌కు చేరుకోగా.. గురువారం శ్రీలంక వర్సెస్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తే వారు ఫైనల్స్ కు చేరే అవకాశం ఉంటుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఫైనల్ కు చేరేందుకు శ్రీలంక జట్టుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీలంక రెండు మ్యాచ్ లలో ఒక విజయంతో -0.200 రన్‌రేట్‌తో ఉంది. పాకిస్థాన్ జట్టు రెండు మ్యాచ్ లలో ఒక విజయంతో – 1,892 రన్ రేటుతో ఉంది. రన్‌రేటు పరంగా పాకిస్థాన్ కంటే శ్రీలంక మెరుగ్గా ఉండటంతో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే శ్రీలంక ఫైనల్స్‌కు చేరే అవకాశం ఉంటుంది. ఇదిలాఉంటే.. ఆసియా కప్ చరిత్రలో వన్డే ఫార్మాట్‌లో భారత్ జట్టు ఆరు సార్లు టైటిల్స్ దక్కించుకుంది. పాకిస్థాన్ రెండు సార్లు, శ్రీలంక ఐదు సార్లు టైటిల్ గెలుచుకుంది.

 

Asia cup 2023

ట్రెండింగ్ వార్తలు