World Cup 2023 ENG vs NZ : ప్ర‌పంచ రికార్డు సృష్టించిన ఇంగ్లాండ్‌.. 4,658 వన్డేల చరిత్రలో ఇదే తొలిసారి

భార‌త్ వేదిక‌గా ప్రారంభ‌మైన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ మొద‌టి మ్యాచులోనే ఇంగ్లాండ్ జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది.

England Create New World Record

World Cup 2023 England vs New Zealand : భార‌త్ వేదిక‌గా ప్రారంభ‌మైన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ మొద‌టి మ్యాచులోనే ఇంగ్లాండ్ జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా న్యూజిలాండ్ తో జ‌రుగుతున్న మ్యాచులో ఇంగ్లాండ్ జ‌ట్టులోని ఆట‌గాళ్లు అంద‌రూ రెండు అంకెల స్కోరు చేశారు. తుది జ‌ట్టులోని 11 మంది ఆట‌గాళ్లు రెండు అంకెల స్కోరు చేసి ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పారు. 4,658 వ‌న్డేల చ‌రిత్ర‌లో ఇలా చేసిన మొద‌టి జ‌ట్టుగా ఇంగ్లాండ్ రికార్డు నెల‌కొల్పింది.

ODI World Cup 2023 : క్రికెట్ వీక్షకుల కోసం సరికొత్త ఫీచర్లతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. వన్డే ప్రపంచ కప్‌ 2023 స్ట్రీమింగ్ ఇలా చూడొచ్చు!

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు.. డేవిడ్‌ మలాన్‌ (14), జానీ బెయిర్‌స్టో (33), జో రూట్‌ (77), హ్యారీ బ్రూక్‌ (25), మొయిన్‌ అలీ (11), జోస్‌ బట్లర్‌ (43), లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (20), సామ్‌ కర్రన్‌ (14), క్రిస్‌ వోక్స్‌ (11), మార్క్‌ వుడ్‌ (13 నాటౌట్‌), ఆదిల్‌ రషీద్‌ (15 నాటౌట్‌) లు రెండు అంక్కెల స్కోరు సాధించారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ మూడు వికెట్లు తీయ‌గా, సాంట్నర్‌, ఫిలిప్స్ చెరో రెండు, బౌల్ట్‌, రవీంద్ర ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

ట్రెండింగ్ వార్తలు