Mohammad Rizwan : దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో మ‌హ్మ‌ద్ రిజ్వాన్ ఘ‌న‌త‌

పాకిస్థాన్ మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ రిజ్వాన్ వ‌న్డేల్లో 2 వేల ప‌రుగులను పూర్తి చేసుకున్నాడు.

Mohammad Rizwan

Mohammad Rizwan 2000 ODI runs : పాకిస్థాన్ మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ రిజ్వాన్ వ‌న్డేల్లో 2 వేల ప‌రుగులను పూర్తి చేసుకున్నాడు. చెన్నై వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో అత‌డు ఈ మైలురాయిని చేరుకున్నాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి రిజ్వాన్ ఈ ఘ‌న‌త అందుకున్నాడు. 2 వేల ప‌రుగుల‌ను పూర్తి చేసేందుకు రిజ్వాన్‌కు 65 ఇన్నింగ్స్‌లు అవ‌స‌రం అయ్యాయి. ఇక ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ 27 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 31 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు.

రిజ్వాన్ ద‌క్షిణాఫ్రికాతో మ్యాచ్‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు 71 వ‌న్డేలు ఆడాడు. 65 ఇన్నింగ్స్‌ల్లో 39.9 స‌గ‌టుతో 2,026 ప‌రుగులు చేశాడు. ఇందులో 3 శ‌త‌కాలు, 13 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు 131. ఇక వ‌న్డేల్లో ఈ ఏడాది పాకిస్థాన్ త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగానూ రిజ్వాన్ నిలిచాడు. 22 మ్యాచుల్లో 67 స‌గ‌టుతో 940 ప‌రుగులు చేశాడు.

MS Dhoni : ప్ర‌పంచ‌కప్ లోటీమిండియా విజ‌యావ‌కాశాల‌పై ధోనీ కామెంట్స్ వైర‌ల్‌

టాప్‌-5లో రిజ్వాన్‌..

భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ రిజ్వాన్ రాణిస్తున్నాడు. 80 స‌గ‌టుతో 330 కి పైగా ప‌రుగులు చేసి ఈ మెగా టోర్నీలో అత్యధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో టాప్‌-5లో నిలిచాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ 407 పరుగులతో మొద‌టి అగ్రస్థానంలో ఉన్నాడు. టీమ్ఇండియా ఆట‌గాళ్లు విరాట్ కోహ్లి 354, రోహిత్ శర్మ 311 ప‌రుగులు చేశారు. ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ ఐదు మ్యాచ్‌ల్లో 332 పరుగులు చేశాడు.

గెలిస్తేనే..

ఈ మెగాటోర్నీలో పాకిస్థాన్ ఇప్ప‌టి వ‌ర‌కు (ద‌క్షిణాఫ్రికాతో మ్యాచ్ కాకుండా) ఐదు మ్యాచులు ఆడింది. రెండు మ్యాచుల్లో గెలిచి మూడింటిలో ఓడిపోయింది. నాలుగు పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో ఆరో స్థానంలో కొన‌సాగుతోంది. ద‌క్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో విజ‌యం సాధిస్తేనే పాక్ సెమీస్ ఆశ‌లు ఉంటాయి. లేదంటే గ‌ల్లంతు అయిన‌ట్లే. ఇంత‌టి కీల‌కమైన మ్యాచ్‌లో పాకిస్థాన్ 20 ఓవ‌ర్లు ముగిసే స‌రికి మూడు వికెట్లు కోల్పోయి 102 ప‌రుగులు చేసింది. ఇఫ్తికార్ 5, బాబ‌ర్ ఆజాం 36 ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

Rohit Sharma : ఇంగ్లాండ్‌తో మ్యాచ్ రోహిత్ శ‌ర్మ‌కు ఎంతో ప్ర‌త్యేకం.. ఎందుకో తెలుసా..?

ట్రెండింగ్ వార్తలు