Google Play Store : గూగుల్ ప్లే‌స్టోర్‌లో ఇకపై ఆ యాప్స్ కనిపించవు..!

Google Play Store : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ప్రధాన సర్వీసుల్లో ఒకటైన ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌లో మిలియన్ల కొద్ది యాప్స్ అందుబాటులో ఉన్నాయి.

Google Play Store : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ప్రధాన సర్వీసుల్లో ఒకటైన ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌లో మిలియన్ల కొద్ది యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ప్లే స్టోర్ లో అధికారిక యాప్స్ కంటే అనాధికారిక యాప్స్ ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ప్లే స్టోర్‌లో యాప్ రిజిస్టర్ చేసుకున్నాక అప్ డేట్స్ చేయకపోవడం పాత వెర్షన్ ఉండిపోవడం వంటి జరుగుతున్నాయి. కొత్త అప్ డేట్స్ లేని యాప్స్, ప్రైవసీ పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఔట్ డేటెడ్ యాప్స్ విషయంలో ఎలాంటి నోటిఫికేషన్లు లేకపోవడంతో చాలామంది ఆండ్రాయిడ్ యూజర్లు ఇలాంటి ఔట్ డేటెడ్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకుంటున్నారు.

ఇలాంటి యాప్స్ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా భద్రతపరమైన సమస్యలు తలెత్తే రిస్క్ ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గూగుల్ కూడా తమ ప్లే స్టోర్‌లో అప్ డేట్ కానీ భద్రత లోపాలు కలిగిన యాప్స్ విషయంలో ఫోకస్ పెట్టింది. లేటెస్ట్ ప్రైవసీ, భద్రతా ఫీచర్‌లు లేని యాప్స్ డౌన్‌లోడ్ చేయరాదని గూగుల్ చెబుతోంది. Google ప్లే స్టోర్‌లో చాలా పాత యాప్‌లు ఉన్నాయి. ప్లే స్టోర్‌లోని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేని యాప్స్ గుర్తించి, ఆయా యాప్స్ యూజర్లకు కనిపించకుండా హైడ్ చేయనున్నట్టు సెర్చ్ దిగ్గజం గూగుల్ ప్రకటించింది.

ఓ నివేదిక ప్రకారం.. Google Play Storeలో 3.5 మిలియన్ల యాప్‌లు ఉన్నాయి. కాలం చెల్లిన యాప్‌లు అధికంగా ఉన్నాయని గుర్తించింది. కాలం చెల్లిన యాప్‌లతో భద్రతపరంగా ముప్పు ఉంటుంది. అందుకే ఆండ్రాయిడ్ యూజర్ల డేటా సురక్షితంగా ఉండాలని Google భావిస్తోంది. అందులో భాగంగానే ఔట్ డేటెడ్ యాప్స్ ప్లే స్టోర్ లో కనిపించకుండా హైడ్ చేయనుంది. ఈ కొత్త మార్పులు నవంబర్‌లో అమలులోకి వస్తాయని కంపెనీ బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది. నవంబర్ 1, 2022 నుంచి లేటెస్ట్ Android వెర్షన్ రిలీజ్ చేయనుంది.

రెండేళ్లలోపు API స్టేటస్ లేని Android OS వెర్షన్‌లు కొత్త యూజర్ల కోసం ఇకపై అందుబాటులో ఉండవు. ఈ ఏడాది చివరి నాటికి మార్పులు చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. మీ ఫోన్‌లో ఇదివరకే ఉన్న పాత యాప్‌లకు యాక్సెస్‌ చేసుకోవచ్చు. Google ఔట్ డేటెడ్ యాప్స్ కనిపించకుండా హైడ్ చేస్తుంది అంతే. కానీ, ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేయలేదు. అలా హైడ్ చేసిన యాప్స్ సెర్చ్ చేయాలంటే కొంచెం లోతుగా సెర్చ్ చేయాలి. Android 10 లేదా అంతకంటే పాత వెర్షన్‌ల యాప్స్ మాత్రమే కనిపించవు. కొత్తగా ఫస్ట్ టైం ఇన్ స్టాల్ చేసుకునే యూజర్లకు అందుబాటులో ఉండవు.

Read Also : Moto G22 : ఇండియాలో ఫస్ట్ G37 ప్రాసెసర్‌తో Moto G22 కొత్త ఫోన్.. ఫీచర్లు సూపర్.. ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు