101 Cases On MLA Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్‌పై 101 కేసులు.. రౌడీషీటర్‌గా పేర్కొన్న పోలీసులు

రాజాసింగ్ పై 2004 నుండి 101 కేసులు నమోదయ్యాయి. ఇందులో 18 మతపరమైన కేసులు ఉన్నాయి. ఓ ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ నమోదు చేయడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే తొలిసారి.

101 Cases On MLA Raja Singh : మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల కేసులో గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను మరోసారి అరెస్ట్ చేసిన పోలీసులు ఆయ‌న‌పై పీడీ యాక్ట్ కింద కేసు న‌మోదు చేశారు. గురువారం మ‌ధ్యాహ్నం రాజాసింగ్‌ను ఆయ‌న ఇంటి దగ్గరే అదుపులోకి తీసుకున్న మంగ‌ళ్ హాట్, షాహినాయ‌త్ గంజ్ పోలీసులు నేరుగా నాంప‌ల్లి కోర్టుకు త‌ర‌లించారు. రాజాసింగ్‌కు న్యాయ‌మూర్తి జ్యుడిషియ‌ల్ రిమాండ్ విధించగా.. పోలీసులు రాజాసింగ్ ను చర్లపల్లి జైలుకి తరలించారు.

పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో విద్వేషాలు రెచ్చగొట్టారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరించారని పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు పెట్టారు. రాజాసింగ్ పై 2004 నుండి 101 కేసులు నమోదయ్యాయి. ఇందులో 18 మతపరమైన కేసులు ఉన్నాయి. ఓ ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ నమోదు చేయడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే తొలిసారి.

PD Act On Raja Singh : రాజాసింగ్‌పై పీడీ యాక్ట్.. తెలుగు రాష్ట్రాల చరిత్రలో తొలిసారిగా ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్

పోలీసులు తెలిపిన వివరాలు..
”టి.రాజాసింగ్ లోధ్ @ రాజు సింగ్ రాజాసింగ్, S/O టి.నావల్ సింగ్, ఎమ్మెల్యే, గోషామహల్ నియోజకవర్గం. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ లో రౌడీషీటర్, పీడీ చట్టం అమలు చేయబడింది. రౌడీషీటర్ 1986 చట్టం నెం.1 ప్రకారం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ నమోదు. రెచ్చగొట్టే ప్రసంగాలతో రెండు వర్గాల మధ్య చీలికకు కారణమైన నేపధ్యంలో రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు. ఇటీవలే రాజాసింగ్ (ఆగస్టు 22) “శ్రీ రామ్ ఛానల్, తెలంగాణ”లో *ఫారుకీ కె ఆకా ఇతిహాస్ సునియే అనే శీర్షికతో యూట్యూబ్‌లో మహమ్మద్‌ ప్రవక్తకు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. అన్ని వర్గాల ప్రజలను రెచ్చగొట్టి తద్వారా శాంతికి విఘాతం కలిగించాలనే ఉద్దేశ్యంతో రాజాసింగ్ ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేశాం” అని పోలీసులు వివరించారు.

Asaduddin Owaisi: రాష్ట్రాన్ని ఆహుతి చేద్దామనుకున్నారా.. బీజేపీపై అసదుద్దీన్ ఫైర్

ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ పై పీడీ యాక్ట్ నమోదు, అరెస్ట్ కు నిరసనగా బేగంబజార్ లో వ్యాపారులు బంద్ పాటిస్తున్నారు. దుకాణాలను స్వచ్చందంగా మూసివేశారు. బేగంబజార్ లో సుమారు వెయ్యికిపైగా దుకాణాలు మూతబడ్డాయి.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ట్రెండింగ్ వార్తలు