Man Killed In Hyderabad : హైదరాబాద్ సైదాబాద్‌ లో వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సైదాబాద్‌ సింగరేణికాలనీలో నేనవత్ లక్పతి అనే వ్యక్తిని దుండగులు దారుణంగా కొట్టి చంపారు. పోలీసులు నిందితులపై సెక్షన్ 304 కింద కేసులు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Man Killed In Hyderabad : హైదరాబాద్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సైదాబాద్‌ సింగరేణికాలనీలో నేనవత్ లక్పతి అనే వ్యక్తిని దుండగులు దారుణంగా కొట్టి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణికాలనీకి చెందిన నలుగురు వ్యక్తులు వెంకటేశ్వర వైన్స్‌ దగ్గర లక్పతిపై దాడి చేశారు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

స్థానికుల సమాచారంతో లక్పతి కుమారుడు ఒక నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. ఈ కేసులో మకట్‌ లాల్‌, గణపతి, గణేష్‌, వెంకటేశ్‌, సైదులు అనే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై సెక్షన్ 304 కింద కేసులు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Atrocity In Hyderabad : హైదరాబాద్‌లో దారుణం…చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన యువకుడు

సైదాబాద్‌ చిన్నారి చైత్ర మృతి తర్వాత మద్యం షాపులకు వ్యతిరేకంగా లక్పతి పోరాడారని ఆయన భార్య విజయ తెలిపారు. అదే కక్షతో లక్పతిని కొట్టిచంపారని ఆరోపించారు. ఇంటికి పెద్దదిక్కును చంపేశారని.. తాను దివ్యాంగురాలినని విజయ వాపోయారు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు