Bandi Sanjay : బిడ్డా కేటీఆర్.. మేం తిట్టడం స్టార్ట్ చేస్తే తట్టుకోలేవ్ : బండి సంజయ్

ప్రధాని పర్యటనతో ప్రగతి భవన్ లో భూకంపం వచ్చిందంటూ బండి సంజయ్ సెటైర్లు వేశారు. కేసీఆర్ అల్లుడు నిన్న టీవీ పగుల గొట్టారని కల్వకుంట్ల కుటుంబం లో లొల్లి స్టార్ట్ అయ్యింది అంటూ విమర్శలు సంధించారు.

Bandi Sanjay ..KTR : ప్రధాని మోదీపై కేసీఆర్ కుటుంబ చేసే వ్యాఖ్యలన్నీ చిల్లర వ్యాఖ్యలు అంటూ బండి సంజయ్ విమర్శించారు. మోదీపై కల్వకుంట్ల అజయ్ రావు (కేటీఆర్) విషాన్ని నింపుకున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రధాని పర్యటనతో ప్రగతి భవన్ లో భూకంపం వచ్చిందంటూ సెటైర్లు వేశారు. సంతోష్ రావు ను కేసీఆర్ ఇంట్లోకి రానివ్వడం లేదని..కేసీఆర్ అల్లుడు నిన్న టీవీ పగుల గొట్టారని కల్వకుంట్ల కుటుంబం లో లొల్లి స్టార్ట్ అయ్యింది అంటూ విమర్శలు సంధించారు.

కేటిఆర్ భాష చూసి తెలంగాణ సిగ్గు పడుతోందన్నారు.కేటీఆర్ సీఎం అభ్యర్థి అయితే.. ఎమ్మెల్యేలు బయటకు వస్తారని అన్నారు. ‘‘బిడ్డా కేటీఆర్.. మేం తిట్టడం స్టార్ట్ చేస్తే.. తట్టుకోలేవ్’’అంటూ బండి విమర్శించారు.నీ కుటుంబం కంటే..పెద్ద చీటర్స్ ఉన్నారా అజయ్..? అంటూ పువ్వాడ అజయ్ కుమార్ పై విరుచుకుపడ్డారు. మంత్రి పదవి కోసం నీ పేరు మార్చిన కేసీఆరే పెద్ద చీటర్
అంటూ విమర్శించారు.

Rahul Gandhi: మోదీ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ రెస్పాండ్.. బీఆర్ఎస్ కు కొత్త అర్థం చెప్పిన కాంగ్రెస్ అగ్రనేత

కేసీఆర్ 15 రోజులుగా కనపడటం లేదు..మాకు అనుమానం కలుగుతోంది..కేసీఆర్ ను కేటీఆర్ ఏమైనా చేశారా..? అంటూ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ బాగుండాలి..సీఎం కేసీఆర్ ను మేమంతా చూడాలి
అంటూ సెటైరిక్ గా వ్యాఖ్యానించారు. మోదీ కామెంట్స్ పై కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టాలి అంటూ సూచించారు.

ట్రెండింగ్ వార్తలు