Kishan Reddy : తెలంగాణ ప్రజల ఇబ్బందులకు, యువత చావుకు కారణం మీరు కాదా? కిషన్ రెడ్డి

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలే. తెలంగాణ ప్రజల ఓట్లు అడిగే హక్కు ఉందా? Kishan Reddy

Kishan Reddy Slams BRS And Congress (Photo : Facebook, Google)

Kishan Reddy Slams BRS And Congress : తెలంగాణలో ఎన్నికల హీట్ పీక్స్ కి చేరింది. పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు నాయకులు. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.

బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు..
తెలంగాణ ప్రజల ఇబ్బందులకు, యువత చావుకు కారణం కాంగ్రెస్ కాదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పై అన్ని వర్గాల ప్రజల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఏ వర్గానికి కూడా ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కు బుద్ది చెప్పేందుకు యువకులు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

Also Read : ఈటల సతీమణి జమున రాజకీయ ఆరంగేట్రం చేస్తారా?

ఆ రెండూ కుటుంబ పార్టీలే..
‘తెలంగాణలో యువత చావుకు కారణం కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజల ఇబ్బందులకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రజల ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ కు ఉందా? కాంగ్రెస్ నాయకులకు తెలంగాణలో పర్యటించే హక్కు లేదు.
తెలంగాణకు పట్టిన కుటుంబ పార్టీ పీడ వదలాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలే. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ మాఫియా తెలంగాణను దోచుకుంది. ఈ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని తెలంగాణ సమాజం కోరుకుంటుంది.

నిజాయితీగా ఓట్లు సాధించి అధికారంలోకి వస్తాం..
ప్రత్యామ్నాయ నీతివంతమైన పాలన అందిస్తున్నారు ప్రధాని మోదీ. ఎన్నికలు అవుతున్న రాష్ట్రంలో కర్ణాటక మంత్రి నేలపై డబ్బు పోసి జల్సాలు చేస్తున్నారు. మూడు నాలుగు నెలల్లో వేల కోట్ల రూపాయలు కర్ణాటక ప్రభుత్వం వసూలు చేస్తుంది. చేయి గుర్తుకు ఓటేసిన పాపానికి కాంగ్రెస్ ఎలక్షన్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. తెలంగాణ లో డబ్బు రాజకీయాలు చేయాలని కాంగ్రెస్ చూస్తుంది. జాతీయ నాయకత్వం మొత్తం రాష్ట్రానికి రాబోతోంది. మేం ఏం చేశామో చెప్పి నిజాయితీగా ఓట్లు సాధించి అధికారంలోకి వస్తాం. సకల జనుల తెలంగాణ కోరుకుంటున్నారు ప్రజలు” అని కిషన్ రెడ్డి అన్నారు.

Also Read : అసెంబ్లీ బరిలోకి దిగమంటున్న బీజేపీ సీనియర్లు.. వారిద్దరికి మినహాయింపు!

బీఆర్ఎస్ జడ్పీటీసీ కందుల సంధ్యా రాణి బీజేపీలో చేరారు. ఆమెకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ పాల్గొన్నారు. కందుల సంధ్యా రాణి రామగుండం టికెట్ ఆశిస్తున్నారు.

వివేక్ వెంకటస్వామి..
పాలకుర్తి జడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి అనేక ఉద్యమాల్లో పాల్గొని రాజకీయాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారు. సంధ్యారాణి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం పార్టీ బలోపేతానికి దోహదమవుతుంది.

మరోవైపు రేపు (అక్టోబర్ 19) బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ బయలుదేరారు కిషన్ రెడ్డి.

ట్రెండింగ్ వార్తలు