Raghunandan Rao : బీజేపీ ప్రభుత్వం రాకుండా అడ్డుకునేందుకే రెండు పార్టీల నేతలు తప్పుడు ప్రచారం : రఘునందన్ రావు

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ఎందుకు ముందుకు వెళ్లడం లేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.  ఎన్నికల ముందు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటని కాంగ్రెస్ వాళ్లు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు.

Raghunandan Rao (1)

Raghunandan Rao Criticism : రాష్ట్రంలో కొన్ని పార్టీల అధ్యక్షుళ్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. పొద్దున లేస్తే బీజేపీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. త్వరలో కవిత అరెస్టు అవుతుందని రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం కేవలం బురదజల్లే ప్రయత్నమేనని అన్నారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా దుబ్బాక క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ కవితకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినట్లు ఎవరైనా మీకు చెప్పారా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాకుండా అడ్డుకునేందుకే రెండు పార్టీల నాయకులు బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల మనసు గాయం అయ్యే విధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకం ఆడుతున్నాయని తెలిపారు.

MP Bandi Sanjay: కేసీఆర్ నిమ్మకాయ ఇచ్చినా, బొట్టు పెట్టినా, కంకణం కట్టినా వద్దని చెప్పండి.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ఎందుకు ముందుకు వెళ్లడం లేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.  ఎన్నికల ముందు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటని కాంగ్రెస్ వాళ్లు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ఓటుకు నోటు సంబంధించి దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పింది నిజం కాదా అని అన్నారు.

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిపై ప్రభుత్వం ఎందుకు తేలికగా తీసుకుంది.. మీరు ఇద్దరు ఒక్కటేనా? అని ప్రశ్నించారు. 20-23 కేసు కోసం మాట్లాడే కాంగ్రెస్ పెద్దలు అంతకంటే ముందు జరిగిన 20-16 కేసులో ఎందుకు తెరమీదకు వస్తలేదని ప్రశ్నించారు. తప్పు చేసిన ఏ పార్టీ వారైనా అరెస్టు చేయండని తమకు అభ్యంతరం లేదన్నారు.

ట్రెండింగ్ వార్తలు