ENG vs WI : వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. తొలి రోజే ఇంగ్లాండ్ వ‌ర‌ల్డ్ రికార్డు..

ఆల్‌రౌండ‌ర్ బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ఇంగ్లాండ్ జ‌ట్టు టెస్టుల్లో బ‌జ్‌బాల్ క్రికెట్ ఆడుతోంది.

ENG vs WI Bazballing England sets world record during day one of 2nd Test

England vs West Indies : ఆల్‌రౌండ‌ర్ బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ఇంగ్లాండ్ జ‌ట్టు టెస్టుల్లో బ‌జ్‌బాల్ క్రికెట్ ఆడుతోంది. ప్ర‌త్య‌ర్థి ఎవ‌రైనా స‌రే దంచ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు ఇంగ్లాండ్ బ్యాట‌ర్లు. ఈ ఏడాది ఆరంభంలో టీమ్ఇండియా చేతిలో భంగప‌డిన‌ప్ప‌టికీ కూడా ఇంగ్లాండ్ బ‌జ్‌బాల్‌ను విడిచిపెట్ట‌లేదు. వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ప్ర‌పంచ రికార్డు సృష్టించింది.

టెస్టుల్లో అత్యంత వేగంగా 50 ప‌రుగులు చేసిన జ‌ట్టుగా రికార్డుల‌కు ఎక్కింది. కేవ‌లం 26 బంతుల్లో (4.2 ఓవ‌ర్ల‌లో) 50 ప‌రుగులు సాధించింది. ఈ క్ర‌మంలో గ‌తంలో త‌న పేరిటే ఉన్న రికార్డును ఇంగ్లాండ్ స‌వ‌రించుకుంది. 1994లో ద‌క్షిణాఫ్రికా పై కేవ‌లం 27 బంతుల్లో (4.3 ఓవ‌ర్ల‌లో) 50 ప‌రుగులు చేసింది. ఇక ఈ జాబితాలో మూడో స్థానంలోనూ ఇంగ్లాండే ఉండ‌డం గ‌మ‌నార్హం. 2002లో శ్రీలంకపై (5 ఓవర్లలో) ఈ మైలురాయిని చేరుకుంది.

Virat Kohli : లైన్‌లోకి వ‌చ్చిన కోహ్లీ.. రియాన్ ప‌రాగ్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌..!

బెన్ డ‌కౌట్ అరుదైన ఘ‌న‌త‌..

ఇంగ్లాండ్ చ‌రిత్ర సృష్టించ‌డంలో కీల‌క పాత్ర పోషించిన బెన్ డ‌కెట్ సైతం అరుదైన ఘ‌నత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అత‌డు కేవ‌లం 32 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్ర‌మంలో టెస్టుల్లో అత్యంత వేగంగా అర్థ‌శ‌త‌కం బాదిన నాలుగో ఇంగ్లాండ్ బ్యాట‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. భార‌త్ పై ఇయాన్ బోథ‌మ్ 28 బంతుల్లో, న్యూజిలాండ్ పై జానీ బెయిర్ స్టో 30 బంతుల్లో, న్యూజిలాండ్ పై ఇయాన్ బోథమ్ 32 బంతుల్లో తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

ఇక ఈ మ్యాచులో మొత్తంగా 59 బంతులు ఎదుర్కొన్న బెన్ డ‌కెట్ 14 ఫోర్ల‌లో 71 ప‌రుగులు చేశాడు. షామర్ జోసెఫ్ బౌలింగ్‌లో జేస‌న్ హోల్డ‌ర్ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ప్ర‌స్తుతం తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ స్కోరు 40 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి 200 ప‌రుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (35), ఓలీ పోప్ (76) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

ICC : అమెరికాలో టీ20 ప్ర‌పంచ‌క‌ప్.. భారీ మూల్యం చెల్లించుకున్న ఐసీసీ..! కోట్ల‌లో న‌ష్టం..!

ట్రెండింగ్ వార్తలు