ICC : అమెరికాలో టీ20 ప్ర‌పంచ‌క‌ప్.. భారీ మూల్యం చెల్లించుకున్న ఐసీసీ..! కోట్ల‌లో న‌ష్టం..!

అమెరికాలో క్రికెట్‌కు ఆద‌ర‌ణ పెంచాల‌న్న ఉద్దేశ్యంతో ఐసీసీ అమెరికాలో మ్యాచులను నిర్వ‌హించింది. అయితే.. దీని వ‌ల్ల‌ ఐసీసీకి పెద్ద మొత్తంలో న‌ష్టం వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

ICC : అమెరికాలో టీ20 ప్ర‌పంచ‌క‌ప్.. భారీ మూల్యం చెల్లించుకున్న ఐసీసీ..! కోట్ల‌లో న‌ష్టం..!

ICC

ICC : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024కు వెస్టిండీస్‌, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. ఈ మెగాటోర్నీలో భార‌త జ‌ట్టు విజేత‌గా నిలిచింది. కాగా.. చాలా మ్యాచుల‌కు అమెరికా ఆతిథ్యం ఇచ్చింది. భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ సైతం అమెరికాలోని న్యూయార్క్ వేదికగానే జ‌రిగింది. ఈ మ్యాచ్ మిన‌హా మిగిలిన మ్యాచ్‌ల‌కు ఆద‌ర‌ణ క‌ర‌వైంది.

అమెరికాలో క్రికెట్‌కు ఆద‌ర‌ణ పెంచాల‌న్న ఉద్దేశ్యంతో ఐసీసీ అమెరికాలో మ్యాచులను నిర్వ‌హించింది. అయితే.. దీని వ‌ల్ల‌ ఐసీసీకి పెద్ద మొత్తంలో న‌ష్టం వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. సుమారు రూ.167 కోట్ల మేర‌ అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు న‌ష్టం వ‌చ్చింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

Suryakumar Yadav : శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌ను ఊరిస్తున్న భారీ రికార్డు..

శ్రీలంక రాజ‌ధాని కొలంబో వేదిక‌గా శుక్ర‌వారం నుంచి జ‌ర‌గ‌నున్న వార్షిక స‌ద‌స్సులో ఈ అంశంపై ప్ర‌ధానంగా చ‌ర్చించ‌న‌ట్లుగా తెలుస్తోంది. ఈ స‌మావేశానికి బీసీసీఐ కార్య‌ద‌ర్శి జైషా హాజ‌రు కానున్నారు. జూలై 19 నుంచి 22 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న వార్షిక స‌మావేశాల్లో ఐసీసీ ఛైర్మ‌న్ ప‌ద‌వి విష‌యంపైనా చ‌ర్చించే అవ‌కాశాలు ఉన్నాయి. అదే స‌మ‌యంలో పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వ‌నున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 కోసం భార‌త జ‌ట్టు పాక్ వెళ్తుందా లేదా అన్న విష‌యాల పైనా చ‌ర్చ జ‌ర‌గ‌నుంది.

ఈ ఏడాది నవంబర్‌లో ఐసీసీ కొత్త ఛైర్మన్‌ను ఎన్నుకుంటారు. న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్‌ బార్క్‌లే ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయ‌న్ను 2025 వ‌ర‌కు కొన‌సాగించే అవ‌కాశాలు లేక‌పోలేదు. బీసీసీఐ కార్య‌ద‌ర్శి జైషా ఐసీసీ ఛైర్మ‌న్ ప‌ద‌వి రేసులో ఉన్న‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ జై షా కోరుకుంటే ఆయ‌న ఐసీసీ ఛైర్మ‌న్‌గా ఏక‌గ్రీవంగా ఎన్నికైయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. బీసీసీఐ కార్య‌ద‌ర్శిగా ఆయ‌న ప‌ద‌వికాలం 2025లో ముగుస్తుంది.

Unluckiest Dismissal : క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఇలాంటి ఔట్‌ను చూసి ఉండ‌రు.. వీడియో వైర‌ల్‌..