Suryakumar Yadav : శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌ను ఊరిస్తున్న భారీ రికార్డు..

టీమ్ఇండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024ను గెల‌వ‌డంలో స్టార్ బ్యాట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ త‌న వంతు పాత్ర పోషించాడు.

Suryakumar Yadav : శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌ను ఊరిస్తున్న భారీ రికార్డు..

Suryakumar Yadav Set To Join Virat Kohli and Rohit Sharma elite Batting List

Updated On : July 18, 2024 / 3:31 PM IST

Suryakumar Yadav elite Batting List : టీమ్ఇండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024ను గెల‌వ‌డంలో స్టార్ బ్యాట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ త‌న వంతు పాత్ర పోషించాడు. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ అనంత‌రం సూర్య‌కుమార్ యాద‌వ్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. శ్రీలంక ప‌ర్య‌ట‌న‌తో అత‌డు మైదానంలో అడుగుపెట్ట‌నున్నాడు. అన్నీ అనుకూలించిన‌ట్ల‌యితే.. అత‌డు లంక ప‌ర్య‌ట‌న‌లో టీ20ల్లో టీమ్ఇండియాకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ మేర‌కు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ విష‌యాన్ని కాస్త ప‌క్క‌న బెడితే.. ప్ర‌స్తుతం సూర్య‌కుమార్ యాద‌వ్ ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. లంక‌తో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో సూర్య గ‌నుక 160 ప‌రుగులు చేస్తే.. అంత‌ర్జాతీయ టీ20ల్లో టీమ్ఇండియా త‌రుపున 2500 ప‌రుగులు చేసిన మూడో ఆట‌గాడిగా నిల‌వ‌నున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు సూర్య‌కుమార్ 68 మ్యాచుల్లో 2340 ప‌రుగులు చేశాడు.

Hardik Pandya : టీ20 కెప్టెన్‌గా సూర్య‌కుమార్ యాద‌వ్..? సోష‌ల్ మీడియాలో హార్దిక్ పాండ్యా ఆస‌క్తిక‌ర పోస్ట్‌.. క‌ష్టం ఎన్న‌టికీ..

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు మాత్ర‌మే భార‌త్ త‌రుపున 2500 ప‌రుగులు చేశారు. అంతేకాదండోయ్‌.. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లుగానూ వీరిద్ద‌రే కొన‌సాగుతున్నారు. 159 టీ20 మ్యాచుల్లో 4231 ప‌రుగుల‌తో రోహిత్ శ‌ర్మ అగ్ర‌స్థానంలో ఉండ‌గా, 125 మ్యాచుల్లో 4188 ప‌రుగుల‌తో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. ఇక వీరిద్ద‌రి త‌రువాత పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం 123 మ్యాచుల్లో 4145 ప‌రుగుల‌తో మూడో స్థానంలో ఉన్నాడు.

కాగా.. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు ఇప్ప‌టికే టీ20 క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Unluckiest Dismissal : క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఇలాంటి ఔట్‌ను చూసి ఉండ‌రు.. వీడియో వైర‌ల్‌..