Janhvi Kapoor hospitalised : ఆస్పత్రిలో చేరిన ‘దేవర’ భామ.. ఆందోళనలో అభిమానులు..!
దివంగత అందాల తార శ్రీదేవి తనయగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన చిన్నది జాన్వీ కపూర్.
- Thota Vamshi Kumar
- Published On : July 18, 2024 / 07:53 PM IST
Janhvi Kapoor hospitalised
Janhvi Kapoor : దివంగత అందాల తార శ్రీదేవి తనయగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన చిన్నది జాన్వీ కపూర్. తన అందం, అభినయంతో బాలీవుడ్‌లో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీ తాజాగా ఆస్పత్రి పాలైంది. జాన్వీ కపూర్ తీవ్ర అస్వస్థతకు గురింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పుడ్ పాయిజన్ కావడంతోనే అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
పుడ్ పాయిజన్ కారణంగానే జాన్వీ ఆస్పత్రిలో చేరినట్లు ఆమె తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తెలిపారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటుందని తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. మరో రెండు రోజుల్లో ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానుందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
వరుస సినిమాలతో జాన్వీ బిజీగా ఉంది. జాన్వీ, గుల్షన్ దేవయ్య, రోషన్ మ్యాథ్యూ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉలఝ్’ . ఇటీవలైన ఈ చిత్ర ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలోనూ నటిస్తోంది. ఈ చిత్రంతోనే జాన్వీ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాలోనూ హీరోయిన్‌గా జాన్వీ ఎంపికైంది.
