Muthireddy Yadagiri Reddy : నా కూతురిని అడ్డుకోండి.. కోర్టుని ఆశ్రయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Muthireddy Yadagiri Reddy : ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఫిర్యాదుపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని జనగామ, చేర్యాల పోలీసులను ఆదేశించింది హైకోర్టు.

Muthireddy Yadagiri Reddy

Muthireddy Yadagiri Reddy – High Court: జనగాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కోర్టు మెట్లు ఎక్కారు. కూతురు, అల్లుడు తన కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని, వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారని, తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 22న ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. దాంతో కోర్టుని ఆశ్రయించినట్లు చెప్పారు.

Also Read..Minister KTR : ప్రధానికి మంత్రి కేటీఆర్ 10 ప్రశ్నలు.. సమాధానం చెప్పాకే మోదీ వరంగల్ లో అడుగుపెట్టాలి

పిటిషన్ పై విచారించిన కోర్టు.. ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవానీ రెడ్డి, అల్లుడు పి రాహుల్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, జనగాం, సిద్ధిపేట డీసీపీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఫిర్యాదుపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని జనగామ, చేర్యాల పోలీసులను ఆదేశించింది హైకోర్టు. అనంతరం విచారణను జులై 25కి వాయిదా వేసింది కోర్టు.

తన కార్యక్రమాలు అడ్డుకోకుండా తన కూతురు, అల్లుడిని నిరోధించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కోర్టుని కోరారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు