CM KCR : బీజేపీ నాయకులకు పౌరుషం ఉంటే.. కృష్ణా నది వాటా తేల్చాలని ప్రధాని మోదీని నిలదీయాలి : సీఎం కేసీఆర్

అడ్డంకులను ఎదుర్కొని కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకున్నామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధనతోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. తెలంగాణ వాటాల మేరకు 3 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని తెలిపారు.

CM KCR BRS Public Meeting

CM KCR – BRS Public Meeting : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మూడేళ్ల క్రితం పూర్తి కావాల్సింది.. కానీ, తెలంగాణలోని శత్రువులు అడ్డుకున్నారని విమర్శించారు. మొన్నటి దాకా ఇంటి దొంగలే మనకు ప్రాణగండం అయ్యారు. ఈ జిల్లా వాసులే ప్రాజెక్టులను అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఈ జిల్లాలో ఉన్న దద్దమలే ప్రాజెక్టులను అడ్డుకున్నారని మండిపడ్డారు. పాలమూరు పంప్ పొంగు చూస్తే తన ఒళ్లంత పులకరించిందన్నారు. శనివారం కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని, ప్రసంగించారు.

ఈ ప్రాజెక్టుతో తన జన్మ ధన్యమైందని చెప్పారు. మారిన పాలమూరు ముఖ చిత్రానికి ఇది నిదర్శనం అన్నారు. ఈ రోజు సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన రోజు అన్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్, జిల్లాలకు సువర్ణ అధ్యాయం అన్నారు. తెలంగాణ వస్తేనే మన నీళ్లు, మన నిధులు వస్తాయని చెప్పానని పేర్కొన్నారు. తెలంగాణ వస్తేనే సకల దరిద్రాలు పోతాయని చెప్పానని తెలిపారు. మహబూబ్ నగర్ ఎంపీగానే తెలంగాణను సాధించానని చెప్పారు.

CM KCR : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం.. పంప్ ఆన్ చేసి నీటిని వదిలిన సీఎం కేసీఆర్

ఒకప్పుడు పాలమూరు అంటే వలసల జిల్లా ఇప్పుడు పాలమూరుకు ఇతర రాష్ట్రాల వానే వలస వస్తున్నారని తెలిపారు. అడ్డంకులను ఎదుర్కొని కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకున్నామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధనతోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. తెలంగాణ వాటాల మేరకు 3 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని తెలిపారు. 10 ఏళ్లు పూర్తైన కృష్ణా నది జలాల వాటా తేల్చలేదన్నారు.  బీజేపీ నేతలకు పౌరుషం ఉంటే కృష్ణా ట్రిబ్యునల్ కు రిఫర్ చేయించాలన్నారు.  పదేళ్ల నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందన్నారు.

కృష్ణా జిలాల్లో నీటి వాటా తేల్చాలని కోరితే మోదీ పట్టించుకోలేదన్నారు. ‘మా వాటా నీరు మాకు తేల్చితే మేము బతుకుతాం’ అని బీజేపీ జెండా పట్టుకుని వస్తున్న వారిని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. కృష్ణా నది వాటా తేల్చాలని బీజేపీ నాయకులు ప్రధానిని నిలదీయాలని సూచించారు. ‘మా వాటా మాకు ఇవ్వండి.. మేం ప్రాజెక్టులు నిర్మించుకుంటాం’ అని అన్నారు. ప్రాజెక్టులన్నీ పూర్తైతే తెలంగాణ దేశానికే అన్నం పెడుతుందన్నారు.

CWC in Telangana: కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం తెలంగాణలోనే ఎందుకు? దీని వెనుక భారీ ప్లాన్ ఉందట.. అదేంటంటే?

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పైలాన్ ను ఆవిష్కరించారు. నార్లాపూర్ లో సీఎం కేసీఆర్ తొలి పంపు స్విచ్ ఆన్ చేసి నీటిని వదిలారు. పంప్ హౌస్ దగ్గర కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. పంప్ హౌస్ వద్ద సీఎం కేసీఆర్ మొక్క నాటారు.

ట్రెండింగ్ వార్తలు