CM KCR : మతోన్మాదుల చేతిలో గాంధీజీ కన్నుమూయడం విషాదకరం : సీఎం కేసీఆర్

భారత పోరాట చరిత్రను నేటి తరానికి తెలిసే విధంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించామని పేర్కొన్నారు. రాజ్ గురు, భగత్ సింగ్, సుఖదేవ్, సుభాష్ చంద్రబోస్ వీరత్వం నేటి తరానికి స్ఫూర్తిగా ఉండాలన్నారు.

CM KCR Independence Diamond Jubilee (1)

CM KCR – Independence Diamond Jubilee : మతోన్మాదుల చేతిలో గాంధీజీ కన్నుమూయడం విషాదకరమని సీఎం కేసీఆర్ అన్నారు. గొప్ప నాయకుల్లో గాంధీ అగ్రగన్యులని పేర్కొన్నారు. గాంధీ చూపిన అహింసా పద్ధతిలోనే తెలంగాణ ఉద్యమ సాగిందన్నారు. రాజ్ గురు, భగత్ సింగ్, సుఖే దేవ్ లాంటి అనేక మంది వీరుల త్యాగం చిరస్మరణీయం అన్నారు. సుభాష్ చంద్రబోస్ వీరత్వం నేటికి మనకు స్ఫూర్తినిస్తుందన్నారు.

శుక్రవారం హెచ్ఐసీసీలో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గత సంవత్సరం వజ్రోత్సవాలను 15 రోజులు జరుపుకున్నామని తెలిపారు. భారత పోరాట చరిత్రను నేటి తరానికి తెలిసే విధంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించామని పేర్కొన్నారు. రాజ్ గురు, భగత్ సింగ్, సుఖదేవ్, సుభాష్ చంద్రబోస్ వీరత్వం నేటి తరానికి స్ఫూర్తిగా ఉండాలన్నారు.

INDIA 3rd Meet: ఇండియా కూటమి 2024 ఎన్నికల వ్యూహం ఇదే.. ఈ 5 కమిటీలతో బీజేపీని కొట్టాలని ప్లాన్

బ్రిటీష్ వలస పాలకులకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్య్ర పోరాటం.. ప్రపంచ చరిత్రలో మహోన్నత పోరాటంగా నిలిచిందన్నారు. గాంధీ చిత్రాన్ని 35 లక్షల మంది చూశారని తెలిపారు. అహింస అనే ఆయుధంతో స్వాతంత్ర్యం విజయ తీరం చేరిందన్నారు. గాంధీ మార్గంలో తెలంగాణ సాధించుకున్నామని పేర్కొన్నారు.  రాజ్యాంగ పరిధిలో రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు.

అహింస మార్గాన్ని విడకూడదనే తాను ఆమరణ నిరాహార దీక్ష చేశానని గుర్తు చేశారు. రైతు బందుతోపాటు అనేక సంక్షేమ పథకాలతో గ్రామ స్వరాజ్యం కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సకల జనుల సంక్షేమమే మనకు సమ్మతం అని తెలిపారు. సర్వతోముఖాభివృద్ధే మన అభిమతం అని పేర్కొన్నారు.

Perni Nani వాడుకుని వదిలెయ్యడంలో చంద్రబాబు దిట్ట.. ఆ నాలుగు పార్టీలను వాడుకుని వదిలేశాడు : పేర్ని నాని

మన నిబద్ధతా, నిజాయితీ జనావళికి అభయం అన్నారు. ముమ్మాటికి విజయం మనలనే వరిస్తుందని.. ఇది సత్యం, ఇది నిత్యం, ఇది తథ్యం అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నిజం చేద్దామని పేర్కొన్నారు. జాతి నిర్మాణంలో తెలంగాణను అనునిత్యం అగ్రభాగంలో నిలుపుదామని పిలుపునిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు