Perni Nani వాడుకుని వదిలెయ్యడంలో చంద్రబాబు దిట్ట.. ఆ నాలుగు పార్టీలను వాడుకుని వదిలేశాడు : పేర్ని నాని

అమరావతి పేరుతో డబ్బులు కొట్టేశారా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకి దమ్ముంటే, నిజాయితీ ఉంటే సమాధానం చెప్పాలన్నారు. ఐటీ నోటీసు ఇచ్చి ఏడాది అయినా ఎందుకు దాచారని ప్రశ్నించారు.

Perni Nani – Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాడుకుని వదిలెయ్యడంలో చంద్రబాబు దిట్టని, కమ్యూనిస్టు, జెఎస్ పీలను వాడుకుని వదిలేశాడని విమర్శించారు. బీజేపీని గతంలో వాడుకుని వదిలేశాడని, మళ్ళీ అవసరం కోసం బీజేపీ చుట్టూ తిరుగుతున్నాడని పేర్కొన్నారు. చివరికి కాంగ్రెస్ ను కూడా వాడుకుని వదిలేశాడని పేర్కొన్నారు. ఎవరితో అవసరం ఉంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాడు.. అవసరం తీరాక వెన్నుపోటు పొడుస్తాడు అని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఓ ఇంగ్లీష్ పత్రిక చంద్రబాబు అవినీతి బాగోతం బట్టబయలు చేసిందన్నారు. 2016 నుండి 2019 వరకూ కాంట్రాక్టు సంస్థల నుండి చంద్రబాబు ముడుపులు తీసుకున్నట్లు ఐటీ గుర్తించిందని తెలిపారు. రూ.119 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు ఐటీ నోటీసులో ఉందన్నారు. చంద్రబాబు ప్రైవేటు సెక్రెటరీ శ్రీనివాస్ ఈ వ్యవహారం నడిపించాడని ఆరోపించారు. మనోజ్ వాసుదేవ్ పాత్రసాని అనే వ్యక్తి ద్వారా ఈ ముడుపులు పొందారని పేర్కొన్నారు.

Card Prime Software : ఏపీలో ఆస్తుల రిజిస్ట్రేషన్లకు కొత్త సాఫ్ట్‌వేర్

గత ఏడాది సెప్టెంబర్ లో చంద్రబాబుకి ఐటీ ఈ నోటీసులు ఇచ్చిందని గుర్తు చేశారు. తాత్కాలిక రాజధాని పేరుతోనే ఈ దోపిడీ జరిగిందని విమర్శించారు. ఇది ఒక్కరి దగ్గర మాత్రమే ఇంకా చాలా ఉన్నాయని తెలిపారు. ఎన్టీఆర్ పైన ఉండి అన్ని చూస్తున్నారని విధి ఎవరిని వదిలిపెట్టదు అని అన్నారు. రాజకీయంగా జగన్ కు ఎన్టీఆర్ ఆశిస్సులు ఉన్నాయని వెల్లడించారు. ఐటీ నోటీసులు ఇచ్చింది వాస్తవమా కాదా చంద్రబాబు నోరు విప్పాలన్నారు.

అమరావతి పేరుతో డబ్బులు కొట్టేశారా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకి దమ్ముంటే, నిజాయితీ ఉంటే సమాధానం చెప్పాలన్నారు. ఐటీ నోటీసు ఇచ్చి ఏడాది అయినా ఎందుకు దాచారని ప్రశ్నించారు. అమరావతి పేరుతో తండ్రీకొడుకుల అవినీతి దొరికింది రూ.119 కోట్లు మాత్రమేనని దొరకంది ఇంకెంత ఉందోనని చెప్పారు. చంద్రబాబు స్టేలపై బ్రతుకుతున్నాడని, ఈ ఐటీ నోటీసుపై కూడా స్టే తెచ్చుకుంటాడని పేర్కొన్నారు.

YSRTP Into Congress : YSRTP ని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు రంగం సిద్ధం

అయ్యన్న పాత్రుడు విమర్శలు చేస్తే కేసు ఎందుకు పెడతారని.. భూతులు, సంస్కారం లేకుండా మాట్లాడాడు కనుక కేసు పెట్టారని వెల్లడించారు. పార్లమెంట్ అజెండా ఏమీ ఇవ్వలేదని.. అజెండా వచ్చాక తమ అభిప్రాయం చెప్తామని తెలిపారు. ఊహా జనిత విషయాలకు అభిప్రాయం ఎలా చెప్తామని పేర్కొన్నారు. షర్మిల సొంతగా పార్టీ పెట్టుకున్నారని అది ఆమె ఇష్టం అన్నారు.

రాజకీయ పార్టీలు పుడతాయని, కొన్ని అధికారం చేపడతాయి.. మరికొన్ని విలీనం అవుతాయి.. ఇంకొన్ని మూతపడతాయని తెలిపారు. జగన్ ప్రజా నాయకుడు.. జనం గుండెల్లో ఉన్నాడని ఎవరూ వచ్చినా జరిగేది ఏమీ లేదన్నారు. ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలు, నేతలు వస్తూ ఉంటారని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు