Babar Azam : బాబర్ ఆజాంకు ఘోర అవమానం..! నేపాల్ జట్టులోనూ నో ప్లేస్..!
పొట్టి ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శన చేసింది.
- Thota Vamshi Kumar
- Updated on- July 3, 2024 / 06:42 PM IST
Even Nepal wont pick Babar Azam in their team says Shoaib Malik
Babar Azam – Shoaib Malik : టీ20 ప్రపంచకప్ ముగిసింది. భారత జట్టు విశ్వ విజేతగా నిలిచింది. కాగా.. ఈ పొట్టి ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. అమెరికా, భారత్ చేతిలో ఓడిపోయి గ్రూప్ స్టేజీ నుంచే నిష్ర్కమించింది. దీంతో ఆ జట్టు పై ఇంటా, బయటా తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రపంచకప్ ముగిసినా కూడా పాక్ ఆటగాళ్లపై విమర్శల జడివాన ఆగడం లేదు.
పాకిస్తాన్ స్టార్ ఆటగాడు, కెప్టెన్ బాబర్ ఆజాం పై ఆ జట్టు మాజీ ఆటగాడు షోయబ్ మాలిక్ మండిపడ్డాడు. మా అత్యుత్తమ ఆటగాడిని కనీసం నేపాల్ జట్టు తీసుకోదని బాబర్ ఆజాంను అవమానించాడు.
BCCI : ఈ స్టార్ ఆటగాళ్లను బీసీసీఐ విస్మరించిందా..? ఇషాన్ కిషన్‌ను మళ్లీ టీమ్ఇండియాలో చూడలేమా..?
పొట్టి ప్రపంచకప్‌లో బాబర్ ఆజాం కేవలం కెప్టెన్‌గానే కాకుండా ఓ బ్యాటర్‌గానూ విఫలం అయ్యాడు. 4 మ్యాచ్‌లలో 101.66 స్ట్రైక్ రేట్‌తో 122 పరుగులు చేశాడు. ఒక్కహాఫ్ సెంచరీ కూడా బాబర్ ఆజం నమోదు చేయలేకపోయాడు. అత్యధిక స్కోరు 44 పరుగులు. టీ20 మ్యాచుల వేగాన్ని పరిగణనలోకి తీసుకుంటే అతడి స్ట్రైక్ రేటు చాలా తక్కువగా ఉంది. ఈ క్రమంలో బాబర్‌పై మాలిక్ విరుచుకుపడ్డాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో మాలిక్ మాట్లాడుతూ.. మా అత్యుత్తమ ఆటగాడు ఎవరు..? మా అత్యుత్తమ ఆటగాడు బాబర్ ఆజం. ప్రపంచ క్రికెట్లో టాప్ 4-5 జట్ల గురించి మాట్లాడుతున్నాను. ఆ జట్ల ప్లేయింగ్ ఎలెవన్‌లో బాబర్ సరిపోతాడా? అని ప్రశ్నించాడు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి జట్లు బాబర్ ను తమ జట్లలోకి తీసుకోవు. కనీసం నేపాల్ జట్టు కూడా బాబర్ ఆజాంకు తమ జట్టులో చోటు ఇవ్వదు అని మాలిక్ అన్నాడు.
Riyan Parag : టీమ్ఇండియాకు ఎంపికైన ఆనందంలో పాస్‌పోర్టు, ఫోన్ మరిచిపోయిన రియాన్ పరాగ్..
