BCCI : ఈ స్టార్ ఆట‌గాళ్లను బీసీసీఐ విస్మ‌రించిందా..? ఇషాన్ కిష‌న్‌ను మ‌ళ్లీ టీమ్ఇండియాలో చూడ‌లేమా..?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముగిసింది. టీమ్ఇండియా ఇప్పుడు జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు సిద్ధ‌మ‌వుతోంది.

BCCI : ఈ స్టార్ ఆట‌గాళ్లను బీసీసీఐ విస్మ‌రించిందా..? ఇషాన్ కిష‌న్‌ను మ‌ళ్లీ టీమ్ఇండియాలో చూడ‌లేమా..?

Ishan Kishan Among Top Players Snubbed By BCCI

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముగిసింది. టీమ్ఇండియా ఇప్పుడు జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు సిద్ధ‌మ‌వుతోంది. జూలై 6 నుంచి ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ ఆడేందుకు ఇప్ప‌టికే 15 మంది స‌భ్యుల‌తో కూడిన భార‌త జ‌ట్టు హ‌రారే చేరుకుంది. సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌కు విశ్రాంతి ఇవ్వ‌డంతో శుభ్‌మ‌న్ గిల్ నాయ‌క‌త్వంలో భార‌త్ బ‌రిలోకి దిగ‌నుంది. ఈ సిరీస్‌కు ఎంపికైన య‌శ‌స్వి జైస్వాల్‌, శివ‌మ్ దూబె, సంజూశాంస‌న్ లు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ బృందంలో భాగంగా ఉన్నారు.

బార్బ‌డోస్‌లో తుఫాన్ కార‌ణంగా ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన భార‌త బృందం స్వ‌దేశం రావ‌డానికి ఆల‌స్యం కానుంది. ఈ క్ర‌మంలో ఈ ముగ్గురికి ప్ర‌త్యామ్న‌యంగా బీసీసీఐ హ‌ర్షిత్ రాణా, జితేష్ సింగ్‌, సాయి సుద‌ర్శ‌న్‌ల‌ను తొలి రెండు టీ20ల‌కు ఎంపిక చేసింది. ఐపీఎల్‌లో వీరు ముగ్గురు అద‌ర‌గొట్ట‌డంతో టీమ్ఇండియాలో స్థానం ద‌క్కించుకున్నారు.

ICC T20I Rankings : టీ20ల్లో హార్దిక్ పాండ్యానే నంబ‌ర్ వ‌న్ ఆల్‌రౌండ‌ర్‌.. 12 స్థానాలు ఎగ‌బాకిన జ‌స్‌ప్రీత్ బుమ్రా

మ‌రీ వారి ప‌రిస్థితి ఏంటో..?

ఇక్క‌డి వ‌ర‌కు అంతా బాగానే ఉంది గానీ.. ఇషాన్ కిష‌న్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌, కేఎల్ రాహుల్ వంటి స్టార్ ఆట‌గాళ్ల‌తో పాటు వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, ఉమ్రాన్ మాలిక్‌, య‌శ్ ద‌యాల్ వంటి యువ ఆట‌గాళ్లు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌2024 బృందంలో గానీ, జింబాబ్వే సిరీస్‌కు గానీ ఎంపిక కాలేదు. యువ ఆట‌గాళ్ల సంగ‌తి కాస్త ప‌క్క‌న‌బెడితే స్టార్ ఆట‌గాడు ఇషాన్ కిష‌న్ ప‌రిస్థితి ఏంటో ఎవ్వ‌రికి ఏమీ అర్థం కావ‌డం లేదు.

ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న నుంచి ఇషాన్ కిష‌న్ అర్థాంత‌రంగా తప్పుకున్నాడు. మాన‌సికంగా అల‌సిపోయాన‌ని కొన్ని రోజులు విశ్రాంతి కావాల‌ని బీసీసీఐకి చెప్పాడు. ఆ త‌రువాత కొన్ని రోజుల‌కు టీమ్ఇండియాలో చోటు కావాలంటే.. రంజీట్రోఫీలో ఆడాల్సిందిగా అప్ప‌టి హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్‌తో పాటు బీసీసీఐ ఇషాన్ కిష‌న్‌కు సూచించింది. ఈ మాట‌లను ఇషాన్ పెడ‌చెవిన పెట్టాడు. హార్దిక్ పాండ్యాతో క‌లిసి ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేసేందుకు మొగ్గు చూపాడు.

Riyan Parag : టీమ్ఇండియాకు ఎంపికైన ఆనందంలో పాస్‌పోర్టు, ఫోన్ మ‌రిచిపోయిన రియాన్ ప‌రాగ్‌..

దీంతో బీసీసీఐ ఇషాన్ పై ఆగ్ర‌హంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే అత‌డి సెంట్ర‌ల్ కాంట్రాక్టు నుంచి త‌ప్పించింది. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌, ఆ త‌రువాత టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంపిక చేయ‌లేదు. క‌నీసం జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు అయినా అత‌డు చోటు ద‌క్కించుకుంటాడు అని అంతా భావించ‌గా అలా జ‌ర‌గ‌లేదు. దీంతో బీసీసీఐ, ఇషాన్ ల మ‌ధ్య ఏదో జ‌రుగుతుంద‌ని అంటున్నారు. చూస్తుంటే ఇషాన్ ఇప్ప‌ట్లో భార‌త జ‌ట్టు తరుపున ఆడ‌తాడా అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి.

జింబాబ్వేతో తొలి రెండు టీ20ల‌కు భారత జ‌ట్టు ఇదే..
శుభమాన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్‌) , హర్షిత్ రాణా.