ICC T20I Rankings : టీ20ల్లో హార్దిక్ పాండ్యానే నంబ‌ర్ వ‌న్ ఆల్‌రౌండ‌ర్‌.. 12 స్థానాలు ఎగ‌బాకిన జ‌స్‌ప్రీత్ బుమ్రా

టీమ్ఇండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సాధించ‌డంలో ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్య కీల‌క పాత్ర పోషించాడు

ICC T20I Rankings : టీ20ల్లో హార్దిక్ పాండ్యానే నంబ‌ర్ వ‌న్ ఆల్‌రౌండ‌ర్‌.. 12 స్థానాలు ఎగ‌బాకిన జ‌స్‌ప్రీత్ బుమ్రా

pic credit : BCCI

టీమ్ఇండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సాధించ‌డంలో ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్య కీల‌క పాత్ర పోషించాడు. జ‌ట్టుకు అవ‌స‌రం అయిన స‌మ‌యంలో బ్యాట్‌, బాల్‌తో స‌త్తా చాటాడు. ఈ క్ర‌మంలో అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్ర‌క‌టించిన ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లాడు. రెండు స్థానాలు మెరుగుప‌ర‌చుకుని ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో అగ్ర‌స్థానానికి చేరుకున్నాడు. టీ20ల్లో ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో అగ్ర‌స్థానానికి చేరుకున్న తొలి భార‌త క్రికెట‌ర్‌గా హార్దిక్ పాండ్యా రికార్డుల‌కు ఎక్కాడు.

పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో హార్దిక్ అద‌ర‌గొట్టాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 151.57 స్ట్రైక్‌రేటుతో 144 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ అర్థ‌శ‌త‌కం కూడా ఉంది. 8 మ్యాచుల్లో 7.64 ఎకాన‌మీతో 11 వికెట్లు తీశాడు. ముఖ్యంగా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచులో 20 ప‌రుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ప్రమాద‌క‌ర బ్యాట‌ర్లు హెన్రిచ్ క్లాసెన్‌, డేవిడ్ మిల్ల‌ర్‌ల‌ను ఔట్ చేసి టీమ్ఇండియా రెండో సారి ప్ర‌పంచ‌క‌ప్‌ను గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

Riyan Parag : టీమ్ఇండియాకు ఎంపికైన ఆనందంలో పాస్‌పోర్టు, ఫోన్ మ‌రిచిపోయిన రియాన్ ప‌రాగ్‌..

ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో శ్రీలంక‌కు చెందిన వనిందు హసరంగ రెండో స్థానానికి ప‌డిపోయాడు. ఆ త‌రువాత మార్కస్‌ స్టాయినిస్‌ (ఆస్ట్రేలియా), సికిందర్ రజా (జింబాబ్వే), షకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్‌) లు వ‌రుస‌గా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.

బౌల‌ర్ల విష‌యానికి వ‌స్తే..
ఇంగ్లాండ్‌కు చెందిన ఆదిల్ ర‌షీద్ తొలి స్థానంలో ఉన్నాడు. ప్ర‌పంచ‌క‌ప్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన అక్ష‌ర్ ప‌టేల్ ఓ స్థానం మెరుగుప‌ర‌చుకుని ఏడో స్థానానికి చేరుకోగా, కుల్దీప్ యాద‌వ్ మూడు స్థానాలు ఎగ‌బాకి ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఇక పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన బుమ్రా ఏకంగా 12 స్థానాలు ఎగ‌బాకి 12వ స్థానంలో నిలిచాడు. అర్ష్‌దీప్ సింగ్ 13వ స్థానానికి చేరాడు. ఇక టీ20ల నుంచి రిటైరైన రోహిత్ శర్మ 36వ, విరాట్ కోహ్లి 40వ స్థానంలో నిలిచారు.

Rohit Sharma : ఎట్ట‌కేల‌కు మ‌ట్టిని తిన‌డానికి గ‌ల కార‌ణాల‌ను చెప్పిన రోహిత్ శ‌ర్మ‌..