AP DSC Exam : టెట్, మెగా డీఎస్సీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. త్వరలో కొత్త తేదీలు..!

AP DSC Exam : టెట్ పరీక్ష కోసం 90 రోజుల సమయం.. మెగా డీఎస్సీకి ప్రిపేర్ అయ్యేందుకు 90 రోజులు సమయం ఇవ్వాలని నిర్ణయించింది. టెట్, మెగా డీఎస్సీ పరీక్షల కొత్త తేదీలను ప్రకటించనుంది.

AP DSC Exam : ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? మీకో శుభవార్త.. టెట్, మెగా డీఎస్సీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్‌, మెగా డీఎస్సీ పరీక్షల కోసం ప్రిపేర్‌ అయ్యేందుకు సమయం ఇవ్వాలని గతకొంతకాలంగా నిరుద్యోగులు కోరుతున్నారు. అభ్యర్థుల వినతిపై సానుకూలంగా స్పందించిన ఏపీ సర్కార్ టెట్, మెగా డీఎస్సీకి సంబంధించి కీలక నిర్ణయాలను వెల్లడించింది.

Read Also : AP Mega Dsc : ఏపీ మెగా డీఎస్సీ.. ఎందులో ఎన్ని పోస్టులు అంటే..?

అందులో టెట్ పరీక్ష కోసం 90 రోజుల సమయం.. మెగా డీఎస్సీకి ప్రిపేర్ అయ్యేందుకు 90 రోజులు సమయం ఇవ్వాలని నిర్ణయించింది. టెట్, మెగా డీఎస్సీ పరీక్షల కొత్త తేదీలను ప్రకటించనుంది. మొత్తం ప్రక్రియ 6 నెలల్లోగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించనుంది. అంతేకాదు.. బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా మెగా డీఎస్సీ రాసేందుకు అవకాశం ఇచ్చింది కూటమి ప్రభుత్వం.

టెట్‌, మెగా డీఎస్సీ పరీక్షల ప్రిపరేషన్ కోసం సమయం ఇవ్వాలంటూ యువజన, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ఇటీవలే ఆయా సంఘాల నేతలు మంత్రి నారా లోకేశ్‌ను స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన నారా లోకేశ్‌ సంబంధిత విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

అభ్యర్థుల వినతులను పరిగణలోకి తీసుకుని టెట్‌, మెగా డీఎస్సీ ప్రిపేర్ అయ్యేందుకు తగిన సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముందు హామీల్లో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Read Also : కాంగ్రెస్ పార్టీలో చేరిన కేశవరావు.. స్వాగతించిన మల్లికార్జున ఖర్గే

ట్రెండింగ్ వార్తలు