పింఛన్ల పంపిణీలో అలాచేస్తే ఊరుకోం..! జగన్ నెల్లూరు పర్యటన వివరాలు వెల్లడించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి

వాలంటీర్లు లేకుండానే సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ పూర్తి చేశామని చెబుతున్నారు. ఆ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది కూడా జగన్ అనేది గుర్తుంచుకోవాలి.

Kakani Govardhan Reddy : టీడీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పింఛన్ల పంపిణీలో టీడీపీ నేతల తీరుపై కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులకు ఇంటివద్దకే పింఛన్లు పంపిణీని మేమూ స్వాగతిస్తున్నాం.. కానీ, పింఛన్ ఇచ్చే సమయంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తిట్టడం సిగ్గుచేటు. పింఛన్ ని ఇంటింటికి పంపిణీకి శ్రీకారం చుట్టింది జగన్ మోహన్ రెడ్డి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కాకాణి టీడీపీ నేతలకు సూచించారు.

Also Read : గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు మరో కీలక బాధ్యత.. ఈసారి ఇంటింటి సర్వే!

వాలంటీర్లు లేకుండానే సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ పూర్తి చేశామని చెబుతున్నారు. ఆ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది కూడా జగన్ అనేది గుర్తుంచుకోవాలి. టీడీపీ తీసుకున్న నిర్ణయ లోపాలు వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారు. టీడీపీ అమలు చేస్తున్న కార్యక్రమాలకు ఇన్స్పిరేషన్ మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డేనని కాకాణి గోవర్దన్ రెడ్డి అన్నారు. పింఛన్లను టీడీపీ నేతలు నొక్కేస్తున్నారు. అలాంటి తప్పులు దొర్లకుండా చూసుకోవాలి. వైసీపీ సానుభూతి పరుల పింఛన్లను తొలగిస్తే ఊరుకోమని కాకాణి హెచ్చరించారు.

Also Read : Bujji in Bhimavaram : ఇదెక్కడి మాస్ రా బాబు.. ప్రభాస్ రేంజ్‌లో భీమవరంలో ‘బుజ్జి’ హవా.. బుజ్జితో ఉండి ఎమ్మెల్యే..

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు ప్రోగ్రాంపై కాకాణి వివరాలు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించేందుకు జగన్ మోహన్ రెడ్డి నెల్లూరుకు వస్తున్నారని తెలిపారు. గురువారం ఉదయం 10:30 నిమిషాలకు జగన్ నెల్లూరుకు వస్తారు. జైలులో పిన్నెల్లిని పరామర్శించిన అనంతరం తిరిగి వెళ్లిపోతారని మంత్రి కాకాణి గోవర్ధన్ చెప్పారు.

 

 

ట్రెండింగ్ వార్తలు