Bujji in Bhimavaram : ఇదెక్కడి మాస్ రా బాబు.. ప్రభాస్ రేంజ్‌లో భీమవరంలో ‘బుజ్జి’ హవా.. బుజ్జితో ఉండి ఎమ్మెల్యే..

భీమవరం అడ్డా అంటే ప్రభాస్ గడ్డ అని తెలిసిందే. ప్రభాస్ సినిమా వచ్చినా, ప్రభాస్ వచ్చినా భీమవరం రోడ్లన్నీ జనసంద్రమవుతాయి. తాజాగా ఈ బుజ్జి వెహికల్ ని భీమవరం తీసుకెళ్లారు.

Bujji in Bhimavaram : ఇదెక్కడి మాస్ రా బాబు.. ప్రభాస్ రేంజ్‌లో భీమవరంలో ‘బుజ్జి’ హవా.. బుజ్జితో ఉండి ఎమ్మెల్యే..

Prabhas Kalki 2898AD Movie Bujji Vehicle in Bhimavaram People go Mad about Bujji Video goes Viral

Bujji in Bhimavaram : ప్రభాస్ కల్కి సినిమాతో పాటు సినిమాలో ప్రభాస్ నడిపిన బుజ్జి వెహికల్ కి కూడా బాగా హైప్ వచ్చింది. అసలు సినిమా ప్రమోషన్స్ కంటే కూడా బుజ్జి ప్రమోషన్స్ ఎక్కువగా చేసారు మూవీ టీమ్, ఇంకా చేస్తున్నారు. సినిమాలో అయితే బుజ్జి వెహికల్ చేసిన యాక్షన్ సీన్స్ కి జనాలు ఆశ్చర్యపోయారు. ఇక ఆ వెహికల్ ని అన్ని ప్రధాన పట్టణాల్లో తిప్పుతున్నారు. దీంతో బుజ్జి వెహికల్ ని చూడటానికి జనాలు, అభిమానులు భారీగా వస్తున్నారు.

భీమవరం అడ్డా అంటే ప్రభాస్ గడ్డ అని తెలిసిందే. ప్రభాస్ సినిమా వచ్చినా, ప్రభాస్ వచ్చినా భీమవరం రోడ్లన్నీ జనసంద్రమవుతాయి. తాజాగా ఈ బుజ్జి వెహికల్ ని భీమవరం తీసుకెళ్లారు. భీమవరంలోని ఓ మాల్ వద్ద ప్రదర్శనకు ఉంచారు. దీంతో ఈ వెహికల్ ని చూడటానికి జనాలు, ప్రభాస్ అభిమానులు భారీగా వచ్చారు. ఆ వెహికల్ తో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు కూడా ఈ బుజ్జి వెహికల్ లో కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చారు.

Also Read : SSMB 29 : మొన్న ప్రభాస్‌తో.. ఇప్పుడు మహేష్ బాబుతో.. రాజమౌళి సినిమాలో ఆ మలయాళం స్టార్ హీరో నిజమేనా?

ఇక ఈ బుజ్జి వెహికల్ ని నిన్న సాయంత్రం భీమవరం వీధుల్లో నడపడంతో ఏకంగా ప్రభాస్ వస్తే ఏ రేంజ్ లో జనాలు వస్తారో ఆ రేంజ్ లో జనాలు భీమవరం వీధుల్లో సందడి చేసారు. అటు ఇటు తాళ్లు పెట్టి మధ్యలో బుజ్జి వెహికల్ ని పోలీసులు, ప్రైవేట్ బందోబస్త్ తో నడిపించారు. ప్రస్తుతం భీమవరంలో బుజ్జి హవా ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలు చూస్తే ఒక వెహికల్ కి ఈ రేంజ్ లో రచ్చ చేసారా అని ఆశ్చర్యపోవడం ఖాయం.