జగన్ వస్తూనే అమరావతి నాశనానికి అడుగులు పడ్డాయి- సీఎం చంద్రబాబు

1631 రోజులు అమరావతి రైతులని, మహిళలని ఎన్ని రకాలుగా హింస పెట్టచ్చో, అన్ని రకాలుగా హింసించాడు.

White Paper On Amaravati : అమరావతిపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. మాజీ సీఎం జగన్ టార్గెట్ గా నిప్పులు చెరిగారు. జగన్ వస్తూనే ప్రజావేదిక కూల్చివేతతో అమరావతి నాశనానికి అడుగులు పడ్డాయని చంద్రబాబు ధ్వజమెత్తారు.

అమరావతి చరిత్ర సృష్టించే నగరం అని సీఎం చంద్రబాబు అన్నారు. శాతవాహనుల కాలంలో అమరావతి కేంద్రంగా పాలన జరిగిందని గుర్తు చేశారు. అమరావతికి ప్రధాని మోడీ ఫౌండేషన్‌ వేశారని తెలిపారు. ఎటు చూసినా సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి అని తెలిపారు. బుద్ధి, జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా దీన్ని వ్యతిరేకించరని వ్యాఖ్యానించారు. కరుడుగట్టిన ఉగ్రవాది కూడా దీన్ని ఒక్పుకుని తీరతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి మట్టి, పలు నదుల నుంచి నీటిని తీసుకొచ్చి అనేకమంది ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. మోడీ సైతం పార్లమెంటు ముందు మట్టిని, యమున నది నీటిని తీసుకుని వచ్చి ఇచ్చారన్నారు.

”జగన్ వస్తూనే ప్రజావేదిక కూల్చివేతతో అమరావతి నాశనానికి అడుగులు పడ్డాయి. 3 రాజధానులు అంటూ తుగ్లక్ నిర్ణయం తీసుకుని, రాష్ట్ర పరువు తీశాడు. 1631 రోజులు అమరావతి రైతులని, మహిళలని ఎన్ని రకాలుగా హింస పెట్టచ్చో, అన్ని రకాలుగా హింసించాడు. ఒక వ్యక్తి మూర్ఖత్వం, ఒక వ్యక్తి కక్ష, ఒక వ్యక్తి తుగ్లక్ నిర్ణయాలు, 5 కోట్ల మంది ఆంధ్రులకు శాపాలయ్యాయి. రాజధాని నిర్మాణం మధ్యలో ఆపివేసిన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు.

2014లో అమరావతి రాజధానికి ఒప్పుకున్నాడు. 2019 ఎన్నికల ముందు నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నా. అమరావతే రాజధాని అని, ఓట్లు వేయించుకుని, మొత్తాన్ని ముంచేశాడు. రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలు, చర్చిలు, మసీదులలో పూజలు చేసి అన్ని గ్రామాల నుంచి నీరు, మట్టి తెచ్చి, అమరావతికి భూమి పూజ చేశాం. గత ఐదేళ్లలో వీళ్ళు అమరావతిని కదిలించలేకపోయారు అంటే ఆ మట్టికి ఉండే విశిష్టత అది.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సెంటర్ పాయింట్ అమరావతి. రాజధాని ఎక్కడ ఉండాలంటే ఎక్కువమంది విజయవాడ గుంటూరు మధ్యలో వుండాలని అభిప్రాయపడ్డారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కింద 16వేల కోట్లు ఆర్థిక లోటు ఉంది. రాజధాని ఎలా కట్టుకోవాలని ఆలోచించాను. హైదరాబాద్ కు నీళ్లు లేవు. కరెంట్ లేదు. కానీ సైబరాబాద్ ను ఎవ్వరూ వెనక్కి తీసుకోలేని పరిస్థితికి వచ్చింది. 14 రోజులు అమెరికాలో ఉండి అన్ని కంపెనీలు తిరిగాను. రాజధాని నిర్మాణానికి ల్యాండ్ ఇవ్వడానికి ఇక్కడి వాళ్లు సిద్ధంగా ఉన్నారు. ల్యాండ్ పూలింగ్ ఆలోచించాను. ఇంత పెద్ద ఎత్తున 29వేల మంది రైతులు 34 ఎకరాల భూమిని ఇచ్చారు. 57, 707 ఎకరాలు మొత్తంగా కలెక్ట్ చేశాం. రాజధాని నిర్మాణం కోసం నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది.

రాజధాని వస్తుందంటే స్వాగతించాలే తప్ప బాధపడకూడదని ఇవన్నీ చేశాను. సింగపూర్ తో ఎంవోయూ చేశాము. ప్రపంచంలో మోస్ట్ రెస్పెక్టబుల్ గవర్నమెంట్ సింగపూర్. అలాంటిది మనకు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. ఇందులో 9 సిటీలు మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. ప్రపంచంలో అన్ని సిటీలకంటె బెస్ట్ నోబెల్ సిటీగా అమరావతి ఉండాలని ఇవన్నీ చేశాం. 51 వేల కోట్లు టోటల్ ప్రాజెక్ట్ ఇది. 4,319 కోట్లు ఖర్చు చేశాం. ఎంత విధ్వంసం చేయాలో అంత చేశారు. రాష్ట్ర భవిశ్యత్తును విధ్వంసం చేశారు. రాజధాని రైతులను ఎంత అవమానించాలో అంత చేశారు. రైతుల త్యాగం ఊరికే పోదు. ఆ త్యాగాలను చరిత్ర ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది” అని సీఎం చంద్రబాబు అన్నారు.

Also Read : ఇక అంతా అయిపోనట్టేనా? ఇళ్లకే పరిమితమైన వైసీపీ నేతలు..! క్యాడర్‌లో తీవ్ర గందరగోళం

 

ట్రెండింగ్ వార్తలు