AUS vs IND : భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా.. మైండ్ గేమ్స్ మొద‌లు.. పాపం స్టీవ్‌స్మిత్‌..

ఈ ఏడాది చివ‌రిలో భార‌త జ‌ట్టు ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది.

Sunil Gavaskar brilliant response to Australias mind games

ఈ ఏడాది చివ‌రిలో భార‌త జ‌ట్టు ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్లు ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇందుకు మ‌రో రెండు నెల‌లకు పైగానే స‌మ‌యం ఉంది. అయిన‌ప్ప‌టికి ఇప్ప‌టి నుంచే ఇరు దేశాలకు చెందిన మాజీ ఆట‌గాళ్లు మాట‌ల యుద్ధానికి తెర‌లేపారు. రికీ పాంటింగ్‌, రవి శాస్త్రి, జెఫ్‌ లాసన్, బుకాన‌న్‌ వంటి మాజీ క్రికెట‌ర్లు మా జ‌ట్టే గెలుస్తుంది.. కాదు కాదు మా జ‌ట్టే గెలుస్తుంద‌ని అంటూ ఎవ‌రి అభిప్రాయాల‌ను వారు చెబుతూ వ‌స్తున్నారు.

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో టీమ్ఇండియా హ్యాట్రిక్ కొట్ట‌డం క‌ష్ట‌మ‌ని ఈ సారి ఖ‌చ్చితంగా ఆస్ట్రేలియానే గెలుస్తుంద‌ని ఆసీస్‌ మాజీ జాన్ బుకానన్ వ్యాఖ్య‌నించాడు. ఈ నేప‌థ్యంలో భార‌త దిగ్గ‌జ ఆట‌గాడు సునీల్ గ‌వాస్క‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆసీస్ ప‌ర్య‌ట‌న‌కు భార‌త జ‌ట్టు వెళ్ల‌డానికి ముందు స్వ‌దేశంలో 5 టెస్టు మ్యాచులు ఆడ‌నుంది. ఆసీస్‌తో టెస్టు సిరీస్ కోసం స‌న్న‌ద్దం కావ‌డానికి భార‌త్‌కు ఇది మంచి అవ‌కాశం. ఇప్ప‌టికే ఇరు దేశాల‌కు చెందిన మాజీ ఆట‌గాళ్లు మైండ్ గేమ్స్‌ను మొద‌లు పెట్టారు.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ పై అంపైర్ అనిల్ చౌద‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు..

అయితే.. ఆస్ట్రేలియా సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తుంద‌ని మెక్‌గ్రాత్ చాలా గ‌ట్టిగా చెప్ప‌లేక‌పోతున్నాడు. త‌మ జ‌ట్టు గెలుస్తుంద‌ని మాత్ర‌మే అంటున్నాడు. దీన్ని బ‌ట్టే భార‌త జ‌ట్టు ఎలాంటి పోటీనిస్తుందో అర్థ‌మ‌వుతుంద‌న్నాడు. ఇక గ‌త టెస్టు సిరీస్‌లో ఆడిన ఆట‌గాళ్లు ఈ సారి ఎంపిక అవుతారో లేదోన‌ని అన్నాడు. టీమ్ఇండియా స్టార్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, ఆస్ట్రేలియా స్టార్ ఆట‌గాడు స్టీవ్ స్మిత్ ఈ జాబితాలో ఉన్నార‌న్నాడు.

గ‌తంలో వీరిద్ద‌రి మ‌ధ్య పోటీ ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉండేద‌న్నారు. స్మిత్‌ను ఔట్ చేసేందుకు అశ్విన్ ప్ర‌త్యేకంగా అస్త్రాల‌ను సిద్ధం చేసుకునేవాడిని చెప్పుకొచ్చారు. ఒకవేళ స్మిత్ గ‌నుక ఈ సారి టెస్టు సిరీస్‌కు ఎంపిక అయితే మాత్రం అత‌డు బుమ్రాను ఎదుర్కొవ‌డం చాలా క‌ష్టం కావొచ్చున‌ని సునీల్ గ‌వాస్క‌ర్ అభిప్రాయ‌ప‌డ్డాడు. బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీలో స్మిత్‌ను అశ్విన్‌ ఎనిమిది సార్లు ఔట్ చేయ‌గా.. ఇంగ్లాండ్ మాజీ పేస‌ర్‌ స్టువర్ట్ బ్రాడ్ తన కెరీర్‌లో 11 సార్లు ఈ మాజీ ఆసీస్ కెప్టెన్‌ను పెవిలియన్ చేర్చాడు.

Joe Root : సచిన్ రికార్డుల‌పై కన్నేసిన ఇంగ్లాండ్ స్టార్‌ ఆట‌గాడు.. అడిగితే ఆస‌క్తిక‌ర స‌మాధానం..

ట్రెండింగ్ వార్తలు