Rohit Sharma : రోహిత్ శర్మ పై అంపైర్ అనిల్ చౌదర్ కీలక వ్యాఖ్యలు..
భారత కెప్టెన్ రోహిత్ శర్మ పై ఐసీసీ ప్యానల్ అంపైర్ అనిల్ చౌదరి ప్రశంసల వర్షం కురిపించాడు.

Umpire Anil Chaudhary Gives Sensational Smart Verdict On Rohit Sharma
భారత కెప్టెన్ రోహిత్ శర్మ పై ఐసీసీ ప్యానల్ అంపైర్ అనిల్ చౌదరి ప్రశంసల వర్షం కురిపించాడు. అతడి బ్యాటింగ్ చూడముచ్చటగా ఉంటుందన్నాడు. అంతేకాదండోయ్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఎంతో తెలివైన ఆటగాడని కితాబు ఇచ్చాడు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 50 కి పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు పనిచేసిన భారత అంపైర్ అనిల్ చౌదరి ఈ వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ శర్మ చూసేందుకు చాలా సాధారణంగా కనిపించినా అతడు ఎంతో తెవివైన ప్లేయర్ అని చెప్పాడు. అతడిని తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నాడు. ఆట పట్ల అతడికి ఎంతో పరిజ్ఞానం ఉందన్నాడు.
Joe Root : సచిన్ రికార్డులపై కన్నేసిన ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు.. అడిగితే ఆసక్తికర సమాధానం..
అతడికి ఎలా ఆడాలో, జట్టును ఎలా నడిపించాలో బాగా తెలుసుని చెప్పుకొచ్చాడు. రోహిత్ ఆడేటప్పుడు అంపైరింగ్ చేయడం చాలా సులభం. అతడు ఔట్, నాటౌట్ విషయంలో చాలా స్పష్టతతో ఉంటాడని తెలిపాడు.
బౌలర్ల మైండ్ సెట్ ను బాగా అర్థం చేసుకుంటాడు. యార్కర్లను కూడా చాలా సులభంగా సిక్సర్లుగా మార్చగలడు. 2013లో ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకపై చేసిన 264 పరుగులే ఇందుకు ఉదాహరణ. అతడి పుట్‌వర్క్ బాగానే ఉంటుంది. ముఖ్యంగా అతడు పదే పదే ముందుకు వచ్చి ఏ మాత్రం ఆడడు. బ్యాట్ ఫుట్‌లోనే నిల్చొని బంతి కోసం వెయిట్ చేసి ఆడతాడు. బంతికి తగ్గట్లుగా కదులుతూ షాట్స్ ఆడతాడు. ఇక క్రీజులో ఉన్నంత సేపు పరుగులు సాధించడమే అతడి లక్ష్యంగా ఉంటుంది అని అనిల్ చౌదరి అన్నాడు.